శనివారం ఎఫ్.ఎన్.సి.సి.లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మంచు విష్ణు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఎన్నికలు ముగిసిన దృష్ట్యా ఇక పై తాను, తన కమిటీ సభ్యులు ఎవరూ మీడియా ముందుకు రాబోమని ప్రకటించారు. ఓ యేడాదితో తాము ఏం చేయబోతున్నామో చెప్పడానికి మాత్రమే మీడియా ముందుకు వస్తామని, ముగిసిన ఎన్నికల గురించి మాత్రం పెదవి విప్పమని అన్నారు. ఎన్నికల సందర్భంగా తాను గెలవాలని కొందరు పూజలు చేశారని, వాటిని…
ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలే అని చెప్పక తప్పదు. ఓ వైపు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ హోరాహోరీగా తలపడ్డాయి. ఎమ్మెల్లే ఎన్నికల తరహాలో జరిగిన ఈ ఎలక్షన్లలో మంచు విష్ణు ప్యానెల్ లో మెజారిటీ సభ్యలు విజయం సాధించారు. అయితే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన సభ్యలు ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియను, మోహన్ బాబు దూషణ…
సాధారణ ఎన్నికలను తలపించిన ‘మా’ ఎన్నికలు ముగిసి ఎట్టకేలకు మంచు విష్ణు అధ్యక్ష పదవిని చేపట్టే సమయం ఆసన్నమైంది. ఈరోజు ఉదయం ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ‘మా’ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. అంతకన్నా ముందు పూజాకార్యక్రమాలతో దేవుడి ఆశీస్సులు అందుకున్న మంచు విష్ణు బ్యాండ్ దరువుల మధ్య ప్రమాణ స్వీకారోత్సవ వేదిక దగ్గరకు వచ్చారు. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాగా…