Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మంచు మోహన్ బాబు రెండో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోజ్ హిట్లు, ప్లాపులు అని లేకుండా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.
'ఉప్పెన' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో ఆ తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తున్నాడు.
బాలనటునిగానే భళా అనిపించిన మంచు మనోజ్, కథానాయకునిగానూ కదం తొక్కాడు. కానీ, ఎందుకనో కొంతకాలంగా మనోజ్ పదం మునుపటిలా ముందుకు సాగడం లేదు. అయినా మనోజ్ తనకంటూ కొంతమంది అభిమాన గణాలను సొంతం చేసుకొని, వారిని మెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా బరిలోకి అయితే దూకాడు కానీ, తండ్రిలా వడి వాడి వేడి అన్నవి మనోజ్ లో అంతగా కనిపించవు. మనోజ్ ఆచితూచి అడుగు వేస్తూ సాగడంలోనే అతని రూటు సెపరేటు…
మరో టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. సమాచారం ప్రకారం టోలిచౌకి వద్ద తాజాగా నటుడు మంచు మనోజ్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపి, అతని కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తీసివేశారు. అలాగే బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారును ఉపయోగిస్తున్నందుకు మనోజ్ కు రూ. 700 జరిమానా విధించారు. టింటెడ్…
టాలీవుడ్ లో మా ఎన్నికలు ఎంతటి సంచలనాన్ని రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో చివరికి మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసి మా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఈ పోటీ నడుస్తున్న క్రమంలో మంచు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేసింది. ఆ సమయంలో నాగబాబు…
గత యేడాది చివరి వారంలో మంచు మనోజ్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. ఆరోగ్యం బాగానే ఉన్నా, కొవిడ్ టెస్టు చేయించుకున్నప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇప్పుడు అదే కరోనా… మంచు లక్ష్మీని పట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా బారి పడకుండా తప్పించుకున్నానని, ఆ దోబూచులాటలో చివరకు ఇప్పుడు దాని చేతికి చిక్కిపోయానని మంచు లక్ష్మీ తెలిపింది. ఇదే సమయంలో ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా…
కరోనా మహమ్మారి మళ్ళీ వేగంగా వ్యాపిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు ప్రజలు. అందుకే కరోనా తగ్గిపోయింది కదా అనే భ్రమలో ఉండకుండా మాస్క్, శానిటైజర్, సామజిక దూరం పాటించడం మంచిదని చెబుతున్నారు వైద్యులు. మరోమారు ప్రముఖ సినీ సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కరీనా కపూర్, ప్రగ్యా జైస్వాల్ వంటి స్టార్స్ కు కరోనా సోకగా… తాజాగా టాలీవుడ్ లో మరో యంగ్ హీరోకు కరోనా పాజిటివ్ గా…
యంగ్ హీరో మంచు మనోజ్ సినిమాల నుంచి చిన్న విరామం తీసుకున్నాడు. అప్పుడప్పుడూ కొన్ని సామాజిక కార్యక్రమాల్లోనూ కనిపిస్తున్నాడు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో మంచు మనోజ్ కన్పించి వార్తల్లో నిలిచాడు. తన సోదరుడు విష్ణుకు సహాయం చేయడంతో పాటు రెండు ప్యానల్లు అనవసరమైన హింసకు పాల్పడకుండా చూసుకోవడానికి మనోజ్ తన శాయశక్తులా ప్రయత్నించాడు. ఆ తరువాత “భీమ్లా నాయక్” సెట్ లో పవన్ ను కలిశాడు. తాజాగా మనోజ్ రెండవ…
‘భీమ్లా నాయక్’ పవన్ కల్యాణ్ తో మంచు మనోజ్ గురువారం సాయంత్రం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఇందుకు భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్ వేదికైంది. స్వతహాగా పవన్ కల్యాణ్ గారంటే మంచు మనోజ్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే మనోజ్ పట్ల పవన్ కల్యాణ్ గారు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిద్దరూ సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించుకున్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చింది. Read…
చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ వెంటనే సమంత సైతం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. టాలీవుడ్ ఓ స్టార్ జంట విడిపోవడం కొత్తేమీ కాదు. సినిమా జంటలు పెళ్ళయ్యాక బ్రేకప్ అయినవి కొన్ని అయితే, కొందరు వివాహ…