మరో టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. సమాచారం ప్రకారం టోలిచౌకి వద్ద తాజాగా నటుడు మంచు మనోజ్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపి, అతని కారుకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌ను తీసివేశారు. అలాగే బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారును ఉపయోగిస్తున్నందుకు మనోజ్ కు రూ. 700 జరిమానా విధించారు. టింటెడ్ గ్లాసెస్‌పై బ్లాక్ ఫిల్మ్ ఉండకూడదు అంటూ సుప్రీంకోర్టు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బ్లాక్ ఫిల్మ్ తో కార్లలో తిరుగుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఎక్కువగా తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇటీవల ట్రాఫిక్ పోలీసులు అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్‌ల కార్లకు కూడా బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించి, జరిమానా విధించిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
Read Also : Macherla Niyojakavargam First Attack : మాచర్ల మాస్ మొదలు.. యాక్షన్ ప్యాక్డ్ టీజర్