Manchu Mohan Babu: చిత్ర పరిశ్రమలో మోహన్ బాబు గురించి కానీ, వారి ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మోహన్ బాబు నటవారసులు మంచు విష్ణు.. ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా చేస్తున్నాడు. రెండు కొడుకు మంచు మనోజ్.. ఒక పక్క నటిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కుమార్తె మంచు లక్ష్మీ.. సినిమాలు చేస్తూనే పలు బిజినెస్ లు చేస్తోంది. ఇక కుటుంబమే తన బలం అని చెప్పుకొస్తున్న మోహన్ బాబు ప్రస్తుతం కూతురుతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇక మోహన్ బాబు కుటుంబం చీలిపోతుందని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం మనోజ్ రెండో పెళ్లి అని చెప్పుకొస్తున్నారు. మనోజ్, భూమా మౌనిక రెండేళ్లు గా రిలేషన్ లో ఉన్నారని సమాచారం. అయితే వీరి రెండో పెళ్ళికి మోహన్ బాబు ఒప్పుకోవడం లేదట. దీనివల్లనేకుటుంబంలో విబేధాలు తలెత్తాయని, ఆ విబేధాలు కాస్తా ఆస్తి పంపకాల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మోహన్ బాబు కుమారులకు ఆస్తి పంచే కార్యక్రమాన్న్ని చెప్పటినట్లు తెలుస్తోంది. ఇద్దరికీ తన ఆస్తిలో సమానంగా పంచి ఎవరికి నచ్చినట్లు వారు ఉండమని కోరుతున్నాడట.
ఇక ఈ ఆస్తి పంపకాల అనంతరం మనోజ్ ఇంటి నుంచి బయటికి వచ్చేసి మౌనికను వివాహమాడనున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే మంచు ఫ్యామిలీ నోరు విప్పాల్సిందే. ఒక వేళ ఇదే కనుక నిజమైతే మోహన్ బాబు కట్టుకున్న ఒక రాజ్యం కూలిపోయినట్టే అని చెప్పుకొస్తున్నారు. అయితే మోహన్ బాబు.. ఈ పెళ్ళికి ఒప్పుకోకపోవడానికి కారణాలు అయితే మౌనిక కుటుంబం మొత్తం టీడీపీ.. ప్రస్తుతం మోహన్ బాబు వైసీపీ లో ఉన్నారు. ఈ రెండు పొత్తు కుదరకపోవడం వలనే ఈ పెళ్లి వద్దు అంటున్నాడు అనేది ఒక కారణమయితే.. తాను చెప్పిన అమ్మాయి ని కాకుండా వేరే అమ్మాయిని మనోజ్ పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం మోహన్ బాబుకు నచ్చలేదని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే వేచి ఉండాల్సిందే.