నేడు యంగ్ హీరో మంచు మనోజ్ బర్త్ డే. పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మంచు మనోజ్ 25,000 కుటుంబాలకు సాయం అందించడానికి ముందడుగు వేశారు.”ఈ సంవత్సరం పుట్టిన రోజున కోవిడ్-19 వల్ల ప్రభావితమైన వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చేయాలి అనుకుంటున్నాను. ముందుగా…
బాలనటునిగానే భళా అనిపించిన మంచు మనోజ్, కథానాయకునిగానూ కదం తొక్కాడు. కానీ, ఎందుకనో కొంతకాలంగా మనోజ్ పదం మునుపటిలా ముందుకు సాగడం లేదు. అయినా మనోజ్ తనకంటూ కొంతమంది అభిమాన గణాలను సొంతం చేసుకొని, వారిని మెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా బరిలోకి అయితే దూకాడు కానీ, తండ్రిలా వడి వాడి వేడి అన్నవి మనోజ్ లో అంతగా కనిపించవు. మనోజ్ ఆచితూచి అడుగు వేస్తూ సాగడం వెనుక కారణాలేమున్నా, అతని…