Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మంచు మోహన్ బాబు రెండో వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మనోజ్ హిట్లు, ప్లాపులు అని లేకుండా మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఇక 2019 లో భార్య ప్రణతికి విడాకులు ఇచ్చిన తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకున్న మనోజ్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ ను నిర్మించి అహం బ్రహ్మాస్మి అనే సినిమాతో రాబోతున్నాడు. ఇక గత రెండేళ్లుగా మనోజ్ ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ రాజకీయ వేత్త దివంగత భూమా నాగిరెడ్డి దంపతుల రెండవ కుమార్తె భూమా మౌనిక. వీరిద్దరికి ఇదే వరకే వేరు వేరుగా పెళ్లిళ్లు అయ్యాయి.
విడాకులు కూడా తీసుకున్న ఈ జంట ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు నిజమే అన్నట్లు నేడు ఈ జంట గణపతి పూజ చేయిస్తూ కెమెరా కంట పడ్డారు. మౌనికకు మనోజ్ మూడు నెలల క్రితమే పెళ్లి ప్రపోజల్ పెట్టాడని టాక్. ఈ విషయమై ఆమె ఆలోచిస్తానని చెప్పిందట. మరోపక్క వీరిద్దరి పెళ్ళికి మోహన్ బాబు ఇష్టపడడలేదని కూడా సమాచారం. ఇక తమ పెళ్లి గురించి ఇప్పట్లో చెప్పబోయేది లేదని, ఏదైనా ఉంటే త్వరలో తానే చెప్పనున్నట్లు మనోజ్ చెప్పుకొచ్చాడు. మరి మోహన్ బాబును ఒప్పించి ఈ జంట ఎప్పుడు ఒక్కటి అవుతారో చూడాలి.