తెలంగాణలో చలి తీవ్రత తగ్గుతోంది. రాబోయే రెండురోజుల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమప్రాంతం నుంచి వస్తున్న గాలుల వల్ల శుక్ర, శనివారాల్లో చలి తీవ్ర పెరుగుతుందని చెబుతున్నారు. కనీస ఉష్ణోగ్రతలు 17.5 శాతం నమోదు కావచ్చు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ 14.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది. తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) అంచనాల ప్రకారం రాబోయే రెండురోజుల పాటు…
మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి.. జిల్లా కేంద్రంలో భూ ప్రకంపనలు సంభవించడంతో.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు… మంచిర్యాలోని చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతా రాంపూర్ తదితన ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూ కదలికలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. భూప్రకంపననల…
తెలంగాణను ఉద్దరించటానికి ఈ మధ్యనే పుట్టిన YSRTP కి ఆదిలోనే హంసపాదులా అన్నీ షాక్‌లే … నిన్నటికి నిన్న ఇందిరా శోభన్ గుడ్‌బై చెప్పి షర్మిలకు షాకిచ్చారు. ఇప్పుడు దెబ్బ మరోలా తగిలింది. అదెలా అంటే.. సర్కార్ కొలువు దొరక్క నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ యువత జ్ఞాపకార్థంగా ఆమె ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్నారు. అలా బలవన్మరణం చెందిన వారి ఇంటికి వెళ్లి అక్కడే దీక్షకు కూర్చుంటున్నారు. అయితే ఆమె ఎవరికోసమైతే ఇదంతా…
ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల… ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ప్రతీ వారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తున్న ఆమె.. ఈసారి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో దీక్షకు దిగనున్నారు.. ఈ నెల 24వ తేదీన మంగళవారం లింగాపూర్‌లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ఉంటుంది.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ ఇంటి…
ఆ జిల్లాలో నేతల మధ్య మెడికల్ కాలేజీ అంశం ప్రకంపనలు సృష్టిస్తోందా? ఎవరికి వారు తమ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారా? అందుకు తగ్గట్టుగానే అధికార పార్టీ నేతలు పావులు కదుపుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది? ఇంతకీ ఏంటా జిల్లా? ఎవరా నాయకులు? మెడికల్ కాలేజీ కోసం అధికార, విపక్షాలు ఉద్యమం మంచిర్యాల జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అలా చెప్పారో లేదో ఇటు జిల్లాలో అధికార…
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తూనే ఉంది. ఇప్పటికే చాలా మంది కరోనాకు బలి అయ్యారు. అయితే ఈ కరోనా వైరస్ భార్య, భర్తల బంధాన్నే మంట కలుపుతోంది. అవును.. కరోనా వస్తే.. భార్యనే వేలేశాడు ఓ భర్త. ఈ ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. కరోనా సోకిన భార్యను బాత్ రూమ్ లో ఉంచాడు. ఇంట్లోని మరుగు దొడ్డిని కూడా వాడకూడదని హెచ్చరించాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లాలోని గోపాలవాడలో మేడి నర్సమ్మ,పెద్దయ్య అనే కుటుంబం…
మంచిర్యాల జిల్లాలో యువతి బావతో పెళ్లి కాదేమోననే నిరాశతో ఆత్మహత్య చేసుకుంది. కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన పడాల హరిప్రియ అనే డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించి ఆమె అమ్మమ్మ, యువతి తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. ఆమెను చెన్నూర్ లోని ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించింది. మేన బావతో పెళ్ళి కాదేమోననే బెంగతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.
మంచిర్యాల పట్టణంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. లాక్డౌన్ అమలు తీరుపై డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంచిర్యాల రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. అన్ని ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో బయట తిరిగేవారిని గుర్తించేందుకు డ్రోన్ నిఘాను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తూ లేనివారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు…
మంచిర్యాలలో రెమ్‌డెసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ దందాపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కేంద్రంగా అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా సాగుతున్న దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా బాధితుల వీక్ నెస్‌ను క్యాష్ చేసుకుంటూ మంచిర్యాలలోని రెండు ప్రైవేట్ దవాఖానలకు చెందిన ఇద్దరు సిబ్బంది, ఇద్దరు అంబులెన్స్ యజమానులు ఒక గ్రూపుగా ఏర్పడి నెల రోజులుగా బ్లాక్ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక్కో…