మంచిర్యాల జిల్లాలో యువతి బావతో పెళ్లి కాదేమోననే నిరాశతో ఆత్మహత్య చేసుకుంది. కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన పడాల హరిప్రియ అనే డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించి ఆమె అమ్మమ్మ, యువతి తల్లిదండ్రులను అప్రమత్తం చేసింది. ఆమెను చెన్నూర్ లోని ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించింది. మేన బావతో పెళ్ళి కాదేమోననే బెంగతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.