తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరుణుడు కాస్త శాంతించాడు. గత కొద్దిరోజులుగా ఎడతెరపిలేకుండా, తన ప్రతాపాన్ని చూపి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాడు. అయితే నిన్న సాయంత్రం 6 గంటలనుంచి కాస్త శాంతించాడు. అయితే మళ్లీ 18 తర్వాత విజృంభించేందుకు అవకాశమున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న (గురువారం) ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా జయశంకర్ జిల్లా రేగులగూడెం, మంచిర్యాల చెన్నూరు లలో 6.2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. read also:…
తెలంగాణకు భారీ వర్ష ముప్పు పొంచి ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ రోజు, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని లెక్కకట్టింది. చాలా ప్రాంతాల్లో 35 సెంటీమీటర్లు దాటి వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా…
ఆదివాసీలపై జరుగుతున్న అటవీశాఖ దాడులపై సీతక్క కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎన్టీవీతో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. పోడు భూముల సమస్యను పరిష్కరించండీ అంటూ మండిపడ్డారు. కోయ పోఛగూడెంలో మహిళలు జైల్ జీవితం అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆదివాసీలకు హక్కులేదా? అంటూ ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్టు అధికారులు కొడితే ఊరుకునేది లేదని, తిరగబడాల్సిందే అంటూ మండిపడ్డారు. కొత్త అడవిని కొడితే గ్రామసభలు పెట్టండీ అంతేకానీ.. ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు…
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు పూర్తిగా రాష్ట్రంలో విస్తరించడంతో అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. విదర్భ ప్రాంతలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 4న రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మంచిర్యాల, జగిత్యాల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు…
ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన పేద ప్రజలు డబుల్ బెడ్‌రూం ఇళ్ల తాళాలు పగులగొట్టి వాటిని ఆక్రమించుకున్నారు. దాదాపు వంద కుటుంబాలకు చెందిన ప్రజలు మూకుమ్మడిగా ఇళ్లలోకి ప్రవేశించారు. కరెంటు, తదితర కనీస సౌక ర్యాలు లేకున్నా ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. అక్రమంగా ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశిం చారనే నెపంతో పలువురిపై కేసులు నమోదు చేసినా ప్రజలు…
ఈరోజుల్లో ప్రతి చిన్న అవసరానికి అప్పు చేయాలి. గతంలో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోవడం, ఆ తర్వాత వాటిని చెల్లించడం చేసేవారు. అయితే, బ్యాంకుల్లో అప్పులకు వడ్డీలు తక్కువ. ఆలస్యం అయితే జరిమానాలు చెల్లించాలి. అంతేగానీ వేధింపులు వుండవు. కానీ ఇప్పుడు లోన్ యాప్ ల పేరుతో అప్పులిచ్చే సంస్థలు పుట్టుకువచ్చాయి. లోన్ యాప్ ల ద్వారా అప్పులు తీసుకునేవారు అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు. లోన్ యాప్స్ ముఠాలు మళ్ళీ రెచ్చిపోతున్నారు. అధిక లాభాలు వస్తుండటంతో…
తెలంగాణలో రెండు జిల్లాల ప్రజల చిరకాల వాంఛ వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. గోదావరి పై బ్రిడ్జ్ నిర్మిస్తే ఆ రెండు జిల్లాల వాసులకు ప్రయాణ దూర భారం తగ్గడమే కాకుండా సులభతరం అవుతుందని భావించిన వారందరికి నిరాశే ఎదురవుతుంది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం మట్టి పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆనందాలు వెల్లివిరిసినా ఐదేళ్ళు అవుతున్నా వంతెన ఊసే లేదని స్థానికులు వాపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి- మంచిర్యాల జిల్లాల మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణంతో రవాణా…
ఆరుగాలం శ్రమించి అరక దున్ని విత్తనాలు వేసినా అవి మొలకెత్తుతాయన్న ఆశలేదు. కొందరు కేటుగాళ్ళ కారణంగా అన్నదాతలకు అగచాట్లు తప్పడంలేదు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామాలపై నకిలీ విత్తనాలు పంజా విసురుతున్నాయి. అమాయక రైతులే టార్గెట్ గా కార్యకలాపాలు అప్పుడే మొదలెట్టేశారు. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో నిషేధిత పత్తివిత్తనాలు అమ్మే ముఠాలు ఎక్కడి నుంచివస్తున్నాయో తెలీడం లేదు. ఏటా ఇదేతంతు జరుగుతున్నా అధికారుల నిఘా కొరవడుతుంది. విచ్చలవిడిగా నకిలీ విత్తనాలు గ్రామాల్లోకి ఇప్పటికే వచ్చిచేరాయి. పోలీసుల…
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల పోలీస్ అధికారులు చేసిన పనికి అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురైన బాధితునికి 3 లక్షల 10 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు. మార్చి 26వ తేదీన మంచిర్యాల టౌన్ పరిధికి చెందిన సాగి మురళీధర్ రావు తండ్రి హన్మంతరావు రిటైర్డ్ ఇంజనీర్, గౌతమి నగర్, మంచిర్యాల అనే వ్యక్తి కి KYC అప్డేట్ కోసం సైబర్ నేరగాడు ఒక మెసేజ్ పంపగా దాన్ని నమ్మి అకౌంట్…
గోదావరి ఉప నది ప్రాణహిత పుష్కరాలు ఇవాళ మొదలు కానున్నాయి. మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం రానుంది. చైత్రశుద్ధ ద్వాదశి నుంచి చైత్రశుద్ధ బహుళ అష్టమి అంటే ఈ నెల 24 వరకు 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరం వేదపండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3.54 గంటలకు పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. కొమురంభీం జిల్లా కౌటాల, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా…