ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల… ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష పేరుతో దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ప్రతీ వారం ఒక ప్రాంతంలో దీక్ష చేస్తున్న ఆమె.. ఈసారి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్‌లో దీక్షకు దిగనున్నారు.. ఈ నెల 24వ తేదీన మంగళవారం లింగాపూర్‌లో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష ఉంటుంది.. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి భూక్యా నరేష్ ఇంటి వద్ద దీక్ష చేపట్టనున్నారు.