మంచిర్యాల జిల్లాలో భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి.. జిల్లా కేంద్రంలో భూ ప్రకంపనలు సంభవించడంతో.. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు… మంచిర్యాలోని చున్నంబట్టి వాడ, శ్రీశ్రీ నగర్, సీతారాంపల్లి, నస్పూర్, సీతా రాంపూర్ తదితన ప్రాంతాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
భూ కదలికలతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఈఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. భూప్రకంపననల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 గా నమోదు అయింది. సీసీసీ నాగార్జున కాలనీలోనూ భూమి కంపించింది. కరీంనగర్ జిల్లా నుంచి 45 కిలోమీటర్ల దూరంలో స్వల్ప భూకంపం సంభవించింది.