తమిళనాడులో ఇటీవల పోలీసుల దెబ్బలు తాళలేక సెక్యూరిటీ గార్డు అజిత్ కుమార్ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టించింది. విపక్షాల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి.. పోలీసులను సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పింది.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం వెదురుకుప్పంలో పురుగుల మందు తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ముల భూమి పరిష్కార విషయంలో పోలీసుల జోక్యం చేసుకుని.. చంద్రశేఖర్‌ను పోలీసులు కొట్టడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి చంద్రశేఖర్ (50) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
నంద్యాల జిల్లా నూనెపల్లె వద్ద రైలు కిందపడి బాల నరసింహులు అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాల నరసింహులు స్వగ్రామం గోస్పాడు మండలంలోని చింతకుంట గ్రామం. ఏడాది క్రితం ఓ యువతీని వేధించాడని బాల నరసింహులుపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2023, మే 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.. ముగ్గురు పిల్లల్తో కలిసి ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భార్యను వివాహేతర సంబంధం వలనే అతడు ఈ దారుణ నిర్ణయానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సీతానగరం మండలం గోకవరంకు చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వంగలపూడికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. సదురు వ్యక్తి ఆటో నడుపుతుండగా.. భార్య కువైట్ వెళ్లి పనిచేస్తోంది. దీంతో పిల్లలు అమ్మమ్మ ఇంటివద్ద చదువుకుంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలను…
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో పడి .. కట్టుకున్నవారిని, కన్నబిడ్డలను వదిలేస్తున్నారు. పరువు మర్యాదులను బజారుకీడుస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్యను కాదని వేరొక మహిళతో అఫైర్ పెట్టుకొన్నాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో ప్రేయసిని వదలలేక, భార్యతో ఉండలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమీన్‌పూర్ టైలర్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌రెడ్డి(35) చందనగర్‌లోని ఓ ఆస్పత్రిలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలు…
ఆ యుకుడికి కొత్తగా పెళ్లైంది.. పెళ్లి తరువాత భార్యను బాగా చూసుకోవాలనుకొని అనుకున్నాడు. దానికోసం ఉపాధి వెతుకుంటూ భార్యను వదిలి సిటీకి చేరుకున్నాడు. ఏదోవిధంగా డబ్బు కూడబెట్టి ఆరునెలల తరువాత ఇంటికి చేరుకున్నాడు. కానీ, అక్కడ భార్య కనిపించలేదు.. ఆమె పుట్టింటికి వెళ్లి కాపురానికి రమ్మని అడిగాడు.. ఆమె షాకింగ్ ఆన్సర్ ఇవ్వడంతో కుంగిపోయాడు. భార్య అన్న మాటలకు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఛత్రా జిల్లాకు…
వివాహ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య అనుమానాలు సాధారణం. భర్త మరొకరితో సంబంధం పెట్టుకున్నాడని, భార్య వేరొకరితో మాట్లాడుతుందని.. డబ్బులు ఇంట్లో ఇవ్వనుకుండా భర్త ఏం చేస్తున్నాడని .. ఇలాంటి అనుమానాలు ఉండడం సాధారణం. కానీ, భర్త ఒక హత్య చేసాడని, వాళ్ల కుటుంబమే హంతకుల ఫ్యామిలీ అని అనుమానించిన భార్య.. అతడిని ఎత్తిపొడుస్తూ అవమానించడంతో ఆ భర్త తట్టుకోలేకేపోయాడు.. ఆగ్రహంతో భార్యను సుత్తితో తలపై బాది హతమార్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తామిద్దరం లేకపోతే పిల్లలు అనాధలవుతారని వారిని…
పరువు, మర్యాద, సమాజంలో గౌరవం ప్రతి ఒక్కరు కోరుకొనేది. బంధువులు, స్నేహితుల మధ్య పరువు పోతుందని ఎంతో మంది దారుణాలకు ఒడిగట్టిన ఘటనలు ఉన్నాయి. మనం ఎంతో ప్రేమించేవారు మనల్ని అందరిముందు అవమానిస్తే అంతకు మిచ్చిన మరణం ఉండదు. ఇదే అనుకున్నాడు ఒక భర్త.. భార్య తన స్నేహితుల ముందు, బంధువుల ముందు తనను అవమానించడంతో తట్టుకోలేని అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పూణెలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. పూణెకు చెందిన ప్రకాశ్…
రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో విషాదం చోటు చేసుకుంది. భార్య తనతో గొడవ పడి పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్ అనే వ్యక్తి. ఇంట్లో తన గది లో ఫ్యాన్ కు తాడుతో ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డాడు శ్రీకాంత్.ఉదయం ఎంతకీ శ్రీకాంత్ ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో అనుమానం తో కిటికీ తెరచి చూసిన స్థానికులకు ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు శ్రీకాంత్. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.…