వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. పరాయి వారి మోజులో పడి .. కట్టుకున్నవారిని, కన్నబిడ్డలను వదిలేస్తున్నారు. పరువు మర్యాదులను బజారుకీడుస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్యను కాదని వేరొక మహిళతో అఫైర్ పెట్టుకొన్నాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో ప్రేయసిని వదలలేక, భార్యతో ఉండలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. అమీన్‌పూర్ టైలర్స్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌రెడ్డి(35) చందనగర్‌లోని ఓ ఆస్పత్రిలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కూడా అదే హాస్పిటల్లో రిసెప్షనిస్ట్ గా పనిచేసి, పిల్లలు పుట్టిన తరువాత మానేసింది. ఇక కొద్దీ రోజులు బాగానే ఉన్న వీరి కాపురంలోకి మరో మహిళ వచ్చింది. ఆసుపత్రిలో శ్రీకాంత్ కి మరో మహిళా పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ఇటీవల భర్త బాగోతం గురించి భార్యకు తెలిసింది. భర్త ఫోన్ లో సదురు మహిళతో దిగిన ఫోటోలు చూసి భర్తను నిలదీసింది. దీంతో శ్రీకాంత్ .. తాను లేకపోతే ఏను ఉండలేనని, తనకు ప్రేయసి కావాలని చెప్పాడు. ఇక ఈ విషయమై భర్తతో గొడవపడిన భార్య ఈనెల 9న భార్య పుట్టింటికి వెళ్ళింది. ఇదే అదునుగా భావించిన శ్రీకాంత్ అటు ప్రేయసిని వదులుకోలేక , ఇటు భార్యతో ఉండలేక ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.