బెంగాల్ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ ‘ఎక్స్’ ట్విట్టర్‌లో మమతను నిలదీశారు.
నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మైక్ కట్ చేశారన్న ఆరోపణలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. సమావేశంలో మాట్లాడేందుకు అందరికీ నిర్ణీత సమయాన్ని కేటాయించినట్లు ఆమె తెలిపారు.
ఆదివారం మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు కాబోతోంది. సాయంత్రం 7:15 గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విపక్షాలకు మినహా విదేశీయులను ఆహ్వానించారు