అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటే.. ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత మరికొన్ని ఆసక్తికరమైన పరిణామలు జరుగుతున్నాయి పశ్చిమ బెంగాల్లో.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు అభిజిత్ ముఖర్జీ ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్‌కతాలోని టీఎంసీ కార్యాలయంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీలో చేరానని అన్నారు. తనకు టీఎంసీలో ఏ పదవి ఇచ్చినా… సైనికుడిలా పనిచేస్తానని చెప్పారు. బెంగాల్లో బీజేపీ…
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్ను తొలగించాలంటూ కేంద్రానికి మూడు లేఖలు రాశామన్నారు సీఎం మమతా బెనర్జీ. గవర్నర్ ధన్కర్ అవినీతిపరుడని, 1996కు చెందిన హవాలా జైన్ కేసులో ఆయనపై చార్జ్షీట్లు కూడా ఉన్నాయని మమత ఆరోపించారు. బెంగాల్ గవర్నర్‌ను తొలగించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేయడం ఇది కొత్త కాదు. గతంలో కూడా బహిరంగంగానే ఆమె ఈ విషయాన్ని ప్రకటించారు. బెంగాల్ అల్లర్లకు సంబంధించి కేంద్రానికి గవర్నర్ తప్పుడు సమాచారం ఇస్తున్నారని, గవర్నర్‌ను వెంటనే వెనక్కి…
నారద కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో మమతా బెనర్జీ నుంచి రికార్డ్ అఫిడవిట్ తీసుకునేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ మమతా బెనర్జీ, బెంగాల్ ప్రభుత్వం, న్యాయశాఖ మంత్రి హైకోర్టులో తాజా అఫిడవిట్లు దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 29కి వాయిదా వేసింది. దీనికి ముందు, నారద స్కామ్‌లో తమ స్టేట్మెంట్ను…
ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రస్తుతం దేశంలో పాపులారిటీ పరంగా బలమైన నేత..! ఆయన నిర్ణయాలు, వైఫల్యాలపై జనంలో ఆగ్రహం ఉన్నప్పటికీ.. మోడీకి సరి సమానమైన నాయకుడు లేరు. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను జనం ఆదరిస్తున్నా.. దేశం వరకు వచ్చే సరికి మోడీకి జై కొడుతున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన వరుస దెబ్బలతో విపక్షాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ఎన్సీపీ అధినేత శరద్…
కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్‌లో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత కొన్ని రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది.. దీంతో.. 18 ఏళ్లు పైబడినవారికి ఇంకా వ్యాక్సినేషన్ ప్రారంభించలేదు.. అయితే, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం చెబుతోంది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండో వ్యాక్సిన్లే కాకుండా మరికొన్ని వ్యాక్సిన్ల కూడా అనుమతి ఇచ్చింది.. అయితే, డిసెంబర్ చివరి నాటికి దేశంలో పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న…
కేంద్రం, పశ్చిమ బెంగాల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.. తాజాగా, యాస్ తుఫాన్‌పై సమీక్షలో ప్రధాని నరేంద్ర మోడీ.. బెంగాల్ సీఎం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి రావడం.. కేంద్రానికి మరింత కోపం తెప్పించినట్టుంది.. దీంతో.. దీదీకి ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది కేంద్రం.. బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలిచామని, వెంటనే రిలీవ్ చేయాల్సింది కేంద్రం సమాచారం ఇచ్చింది.. యాస్ తుఫాన్‌పై ప్రధాని నిర్వహించిన సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే…
టౌక్టే తుఫాన్ నుంచి ఇంకా బయటపడక ముందే ఇప్పుడు మరో తుఫాన్ భయపెడుతున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం బలమైన యాస్ తుఫాన్ గా మారి ఈనెల 26వ తేదీన ఒడిశా, బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నది. తీవ్రమైన తుఫాన్ గా మారుతుందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడంతో తీరప్రాంతంలో తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈరోజు కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా తూర్పు తీరప్రాంత ముఖ్యమంత్రులతో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో…
అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా పశ్చిమబెంగాల్లో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు.. మంత్రులను, టీఎంసీ నేతలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ.. టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు సీబీఐ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.. మంత్రి ఫిర్హాద్ హకీంను, ఇతర నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం మమతా బెనర్జీ.. టీఎంసీకి చెందిన ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్ట్ చేయడంపై భగ్గుమన్న…