కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో పశ్చిమ బెంగాల్‌లో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది.. దానికి ముఖ్యకారణం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడమే కారణం.. ఉప ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు దీదీ.. ఆమె గెలుపు నల్లేరుపై నడకేననే అంతా భావిస్తుండగా.. బీజేపీ మాత్రం దీదీని కోటను బద్దలు కొట్టాలని చూస్తోంది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచి స్థానాలనే కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు భవానీపూర్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది.. తన అభ్యర్థిగా న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ ను ప్రకటించింది బీజేపీ.
ఇక, భవానీపూర్‌తో పాటు సంషేర్‌గంజ్, జాంగిపూర్ నియోజకవర్గాలకు కూడా ఈ నెల 30న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే కాగా.. సంషేర్‌గంజ్ నుంచి మిలన్ ఘోష్, జాంగిపూర్ నుంచి సుజిత్ దాస్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది బీజేపీ. అయితే, దీదీపై పోటీ చేస్తున్న ఈ ప్రియాంక ఎవరు అనే చర్చ మొదలైంది.. 41 ఏళ్ల ప్రియాంక సుప్రీంకోర్టుతో పాటు కోల్‌కతా హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం బీజేపీ చేరిన ఆమె.. యువమోర్చ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతాల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన ఆమెను.. ఈ సారి దీదీపైనే పోటీకి నిలిపింది భారతీయ జనతా పార్టీ.