పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. హస్తిన పర్యటనలో బిజి బీజీగా ఉంది. మిషన్ మోడీ ఉద్వాసనకు రంగం సిద్ధం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా మమత.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో సమావేశం కానున్నారు. ప్రధానంగా పెగసస్ స్పైవేర్ ఆరోపణలు, పెట్రో ధరల పెంపు సహా కీలకాంశాలపై… పార్టీలు ఎలా వ్యవహరించాలన్న అంశంపైనా చర్చించే అవకాశముంది. పెగసస్ స్పైవేర్‌లో మమత పార్టీకి చెందిన అభిషేక్ బెనర్జీ పేరుండడం.. దీన్ని కక్షసాధింపుగా కాంగ్రెస్ నేతలు…
బెంగాల్ సీఎంగా మూడోసారి ఎంపికయ్యాక మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటకు వెళ్లారు. ఢిల్లీలో ప్రధాని మోడితో సహా అనేక మంది నేతలతో దీదీ భేటీ కాబోతున్నారు. కొద్ది సేపటి క్రితమే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన వరద సాయం, వ్యాక్సిన్ డోసులు, రాష్ట్రం పేరు మార్పు తదితర విషయాలపై ఆమె ప్రధానితో చర్చించారు. ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పేవేర్ అంశం కుదిపేస్తున్నది. దీనిపై పార్లమెంట్లో పూర్తి స్థాయిలో చర్చ…
ఐదు రోజుల పర్యటన కోసం మమత బెనర్జీ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ టూర్లో విపక్ష నేతలతో పాటు.. ప్రధాని మోడీని కలుస్తారని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. జులై 28న ప్రధాని మోడీని, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలవనున్నారు మమతా బెనర్జీ.. అయితే, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి…
పెగాసస్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా రచ్చగా మారింది.. పార్లమెంట్ సమావేశాలను సైతం పెగాసస్ రగడ కుదిపేస్తోంది.. ప్రతిపక్షాల ఆందోళనతో సమావేశాలు వాయిదా పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీనియర్ న్యాయమూర్తి మదన్ భీంరావ్ లోకూర్, కోల్కత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయ్ భట్టాచార్యల నేతృత్వంలో హ్యాకింగ్, నిఘాలపై దర్యాప్తునకు ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. అక్రమ హ్యాకింగ్, నిఘా, మొబైల్ ఫోన్ల…
దేశ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూసిన బీజేపీని ఢీకొట్టి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు. మోడీని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని ఒడించేందుకు కొన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తుండేవి. కానీ, పశ్చిమ బెంగాల్లో మమత ఒక్కరే తలపడ్డారు. గతంలో వచ్చిన స్థానాల కంటే ఎక్కువ స్థానాల్లో ఆ…
ప్రధాని నరేంద్ర మోడీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ నెల 28న వీరి భేటీ జరగనుంది. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో కూడా భేటీ కానున్నారు. మమతా బెనర్జీ కోల్‌కతాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కేంద్రంలో ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం నడుస్తున్న సమయంలో మమత భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు మూడు నెలల తర్వాత మమతా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే ఇది…
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం తరువాత ముఖ్యమంత్రి మమత బెనర్జీ దూకుడు పెంచారు. రాబోయో ఎన్నికల్లో మోడీ సారథ్యంలోని బీజేపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షాలన్ని ఏకం అవుతున్నాయి. ఇటీవలే శరద్‌పవార్ ఇంట్లో ప్రతిపక్ష పార్టీలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం తరువాత బీజేపీకి చెక్ పెట్టేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు మమత బెనర్జీ. ఈనెల 25 వ తేదీన ఆమె ఢిల్లీ వెళ్లనున్నారు. నాలుగురోజుల పాటు ఆమె ఢిల్లీలోనే ఉండి కీలక నేతలతో…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో సుదీర్ఘ మంతనాలు జరిపారు.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో దీదీని తిరిగి సీఎం పీఠం ఎక్కిన పీకే.. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయన దీదీతో సుదీర్ఘ మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. మమత బెనర్జీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర…
మరో కీలక నిర్ణయం తీసుకున్ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో శాసన మండలి లేకపోగా.. కొత్తగా శాసన మండలి ఏర్పాటుకు తీర్మానం చేశారు.. ఇవాళ శాసన సభ ఆ తీర్మానానికి ఆమోదం తెలిపింది.. అసెంబ్లీకి 265 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా.. 196 మంది ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే, బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు.. అయితే, సీఎం మమత బెనర్జీ ప్రస్తుతం ఎమ్మెల్యే కాదు.. ఆమె అక్టోబరులోగా..…