కొందరు కొన్ని పాత్రలతో ఇట్టే జనం మదిలో చోటు సంపాదించేస్తారు. వంశీ తెరకెక్కించిన ‘లేడీస్ టైలర్’లోని బట్టల సత్తి పాత్రతో మల్లికార్జున రావుకు ఎనలేని గుర్తింపు లభించింది. అప్పటి నుంచీ మల్లికార్జునరావు తెరపై కనిపిస్తే చాలు జనం ‘బట్టల సత్తి’ అంటూ పిలిచేవారు. అలా ‘బట్టల సత్తి’ గా జనం మదిలో నిలచిన మల్లికార్జున రావు తన దరికి చేరిన ఏ పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయేవారు. జనాన్ని ఆకట్టుకొనేవారు. మల్లికార్జునరావు 1951 డిసెంబర్ 13న అనకాపల్లి సమీపంలోని…