ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆమె ఖండించారు. మోడీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో భారత్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది గొంతు కోల్పోవడం కాదు.. విలువల సర్పణ” అని ఆమె పేర్కొన్నారు. భారత్ చారిత్రక నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని.. మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం బాధాకరమన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 67 సంవత్సరాలు. ఆమె 1958లో ఈ రోజున జన్మించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు నాయకులు రాష్ట్రపతి ముర్ము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడు ముర్ము ఉత్తరాఖండ్‌లో తన పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ సమయంలో ఆమె ఇక్కడి ప్రజలకు ఒక ప్రత్యేక బహుమతిని కూడా ఇవ్వనున్నారు. రాజ్పూర్ రోడ్డులో నిర్మించిన రాష్ట్రపతి నికేతన్‌లో ఆమె తన పుట్టినరోజును జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆమె చాలా ఆధునిక…
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి సరైన పరిహారం అందించాలన్నారు. ఖర్గే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఆయన హైదరాబాద్‌కు బయలుదేరనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానంతో ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిపిన ఆయన.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, కొందరు మంత్రుల శాఖల మార్పులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. Read Also: KCR Live Updates: కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. లైవ్ అప్డేట్స్! మంగళవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రుల…
CM Revanth Reddy : కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించే విషయంలో తడబడుతున్న ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు శాఖల కేటాయింపుపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. అధిష్టానం కీలక నేతలైన కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేలతో ఆయన సమావేశమై మంత్రుల శాఖలపై చర్చించినట్టు తెలుస్తోంది. Tamil Nadu: అన్నామలై ఆలయంలో నాన్ వెజ్ తిన్న…
Mallikarjun Kharge: ఇటీవల పాకిస్తాన్‌పై భారత్ జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’లో కొన్ని వైమానిక నష్టాలు కలిగినట్లు ఈ రోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) అనిల్ చౌహాన్ అంగీకరించారు. తప్పులను సరిదిద్దుకున్న తర్వాత వ్యూహాత్మకంగా పాకిస్తాన్లోకి వెళ్లి దాడులు చేసినట్లు చెప్పారు.
BJP MP Laxman: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలన పైనా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్మారు అని బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మీడియా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారు.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు మోడీ.. దేశంలో అభివృద్ధి తారాస్థాయికి చేరుకుంటుంది అని గుర్తు చేశారు. కానీ, ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెస్ అని మండిపడ్డారు.
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించడంతో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ‘‘చిన్న యుద్ధం’’ అని అభివర్ణించారు.
ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఈ అంశంపై భారత్ వైఖరిని వివరించడానికి కీలకమైన విదేశీ దేశాలను సందర్శించడానికి భారత ప్రభుత్వం ఏడుగురు సభ్యుల అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఉన్నారు. తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇతర నామినేటెడ్ సభ్యులలో బిజెపి నాయకులు…
Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రధాని నరేంద్రమోడీకి ముందే సమాచారం ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి మూడు రోజుల ముందే ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని, ఆ తర్వాత ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి తన పర్యటనను రద్దు చేసుకున్నారని మంగళవారం ఆరోపించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరగడానికి మూడు రోజులు ముందే ప్రధానికి ఇంటెల్ నివేదిక పంపినట్లు ఖర్గే తెలిపారు.