Mallikarjun Kharge: ఢిల్లీలో ఏఐసీసీ నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతోపాటు రాహుల్ గాంధీని తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు చేపట్టారు. ఇక సమావేశం అనంతరం మల్లికార్జున ఖర్గే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే పై ప్రశంసలు గుప్పించారు. ఇందులో భాగంగా.. తెలంగాణలో బలహీన వర్గాల సాధికారత కోసం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విట్టర్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Jagdeep Dhankhar: ధన్‌ఖర్ అధికార నివాసాన్ని సీజ్ చేశారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
ఖర్గే ట్వీట్‌లో.. న్యాయం కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలోని మా పోరాటం ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇడబ్ల్యుఎస్ వర్గాల ప్రజలకు ధ్వని ఇచ్చే ఉద్యమం ఇది అని తెలిపారు. దేశ జనాభాలో అధిక శాతం ఈ వర్గాలు కలిగి ఉన్నా.. కార్పొరేట్ రంగం, న్యాయవ్యవస్థ, ముఖ్యమైన పాలనా వ్యవస్థలలో వీరికి ప్రాధాన్యత లేదని ఆయన విమర్శించారు. అలాగే కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వెనుకబడిన వర్గాల పోస్టులు గురించి ప్రస్తావిస్తూ.. ప్రొఫెసర్ ఉద్యోగాల్లో 80% OBC పోస్టులు, STలకు సంబంధించిన 83% పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం స్వయంగా పార్లమెంటులో తెలిపిందన్నారు. ఇది సామాజిక న్యాయానికి తీవ్ర విఘాతం అని అభిప్రాయపడ్డారు.
Students Study Tips: విద్యార్థులు పరిక్షల్లో టాప్ చేయాలంటే వీటిని పాటిస్తే సరి.. మీరే బెస్ట్.!
అలాగే దేశవ్యాప్తంగా కుల జనాభా లెక్కలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. అంతేకాకుండా 50% రిజర్వేషన్ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజల ఒత్తిడికి లోనై కుల గణన నిర్వహించేందుకు అంగీకరించినా, 50 శాతం పరిమితిని తొలగించడానికి సిధ్దంగా లేదని విమర్శించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక–ఆర్థిక సర్వే గురించి మాట్లాడుతూ, తెలంగాణ చేపట్టిన శాస్త్రీయ సర్వే దేశానికి రోల్ మోడల్ కావాలని ఖర్గే అభిప్రాయపడ్డారు. దాని ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా సంస్థలలో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు సిఫారసు చేసిందని.. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నదని ఆయన గుర్తు చేశారు.
Congress party's Social Justice 2.0 —a new movement for social justice, equity and empowerment of the weaker sections has begun in Telangana.
Our unwavering fight, spearheaded by Shri @RahulGandhi for justice is giving voice to the millions from SC, ST, OBC, EWS communities who… pic.twitter.com/su5jECmVzC
— Mallikarjun Kharge (@kharge) July 24, 2025