కమ్యూనిస్టు పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కేంద్రం ఐటీ, ఈడీలను ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడులపై ఆయన స్పందించారు.
మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిసాయి. రెండు రోజుల పాటు 65 బృందాలతో దాదాపు 400 మంది ఐటీ అధికారులతో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.10.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.