CPI Kunamneni Sambasiva Rao: కమ్యూనిస్టు పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కేంద్రం ఐటీ, ఈడీలను ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడులపై ఆయన స్పందించారు. దేశంలో ఇప్పటివరకు 3 వేల ఈడీ కేసులు నమోదయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతోందని మండిపడ్డారు. తెలంగాణలో మల్లారెడ్డిపై కేంద్రం, కేంద్రసంస్థలపై రాష్ట్ర పోలీసులు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు కూడా విచారణ సంస్థలను దుర్వినియోగపరుస్తున్నాయని అన్నారు.
Read also: Ambati Rambabu: ఏడ్చే మగాడిని నమ్మొద్దు.. అది మన సంస్కృతి..!
బీజేపీకి అనుకూలంగా ఉన్నవారిపై ఒక్కదాడైనా జరిగిందా? అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ ఒక అజ్ఞాని, ఆయన నటన ముందు ఎవరూ సరిపోరంటూ ఆరోపించారు. సంతోష్‌కు నోటీసులిస్తే ఏడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరవరరావులాంటి వారిని జైల్లో పెట్టినపుడు ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. సంతోష్ ఏమైనా దేవుడా? నోటిసులిస్తే తప్పేంటి? అని ప్రశ్నల వర్షం కురిపించారు కూలంనేని. 41 A ప్రకారం అధికారులకు ప్రశ్నించే అధికారం ఉందని అన్నారు. సిట్ వాళ్లను కోరుతున్న..అమిత్ షా ను విచారించాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ పిచ్చివాళ్లు స్వర్గంలో వ్యవహరించినట్టు వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. బండి సంజయ్ కి సిగ్గు ఎగ్గులేదన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే నీకెందుకు? అని, నోరు అదుపులో పెట్టుకోకపోతే మంచి ఉండదని కూనంనేని మండిపడ్డారు.
Samsung Black Friday Sale: భారీ ఆఫర్లు తెచ్చిన శాంసంగ్..