మహిళల భద్రత, స్వయం సమృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, అదే నిజమైన మహిళా సాధికారత అని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం అన్నారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా చౌటుప్పల్‌లో నిర్వహించిన మహిళా బంధు కార్యక్రమంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మహిళల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, అందుకే అన్ని పథకాల కింద కుటుంబాల్లోని మహిళ పేరు మీద అధికశాతం ప్రయోజనాలు కల్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత, రాష్ట్రంలోని మహిళలు మరియు బాలికల భద్రత…