Home
Mahesh Babu
Mahesh Babu News
-
Pooja Hegde: పవన్, మహేశ్లని పక్కనపెట్టి.. విజయ్‌తో రొమాన్స్!
టాలీవుడ్లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబులకు ఎంత క్రేజ్, మార్కెట్, ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ హీరోలతో కలిపి పని చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల దాకా.. క్యూలో నిల్చొంటారు. అలాంటి ఆ ఇద్దరు హీరోలకు.. పూజా హెగ్డే హ్యాండ్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా విజయ్ దేవరకొండ కోసం ఈ అమ్మడు ఆ పని చేసింది. కొన్ని రోజుల నుంచి తానో యాక్షన్ సినిమాలో… -
Allu Arjun: ‘మేజర్’ వ్యాఖ్యలకు ఫిదా అవ్వాల్సిందే!
అడివి శేష్ టైటిల్ రోల్లో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మేజర్’ సినిమాపై సర్వత్రా ప్రశంసలు వచ్చి పడుతున్నాయి. ఒక మంచి సినిమా తీశారని యూనిట్ సభ్యుల్ని శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. సాధారణ ఆడియన్సే కాదు, సినీ ప్రముఖులు సైతం ఈ చిత్రంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. రీసెంట్గా ఈ సినిమా చూసి ఫిదా అయిన బన్నీ, తన అనుభూతిని ట్విటర్ మాధ్యమంగా పంచుకున్నాడు. ‘‘మేజర్… -
Sarkaru Vaari Paata: ఓటీటీలో రిలీజైన సినిమా.. కానీ ఓ ట్విస్ట్!
అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’.. రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. కానీ, ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఈ సినిమాని ఓటీటీలో చూడాలంటే.. రూ. 199 చెల్లించాలి. అంటే.. పే-పర్-వ్యూ విధానంలో ఈ సినిమాని ఇప్పుడే ఓటీటీలో వీక్షించొచ్చు. తొలుత ‘కేజీఎఫ్: చాప్టర్2’ ఇదే విధానంలో అందుబాటులోకి తెచ్చింది ప్రైమ్ వీడియో.… -
Major: సినిమా చూసి మహేష్ ఏడ్చేశాడట..
అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మేజర్’. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. జూన్ 3 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాను జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన… -
Pawan Kalyan : పవన్, రాజమౌళి కాంబినేషన్ సాధ్యమేనా!?
సోషల్ మీడియా పెరిగిన తర్వాత రోజూ పలు రకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రకరకాల కాంబినేషన్స్ లో సినిమా అంటూ రూమర్స్ వింటూనే ఉన్నాం. అయితే వాటిలో కొన్ని కార్యరూపం దాల్చిన సందర్భాలు లేకపోలేదు. ఎక్కువగా ఈ రూమర్స్ చెవులను తాకి వెళ్ళిపోతుంటాయి. అలాంటి రూమర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలయికలో సినిమా అన్నదే ఆ… -
Mahesh Babu: తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపిన సూపర్‌స్టార్
టాలీవుడ్ అలనాటి హీరో సూపర్‌స్టార్ కృష్ణ నేడు 80వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘నాన్న.. పుట్టినరోజు శుభాకాంక్షలు! నీలాగా మరెవ్వరూ లేరు. మరింత ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ’’ అంటూ మహేశ్ ట్వీట్ చేశాడు. మహేశ్ భార్య నమ్రతా సైతం మామయ్యకు బర్త్ డే విషెస్ తెలిపింది. ‘‘కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాకెన్నో జ్ఞాపకాలున్నాయి. మీరు నా జీవితంలో ప్రేమ, దయ,… -
SSMB29: రంగంలోకి ఇద్దరు క్రేజీ స్టార్స్..?
సర్కారు వారి పాటతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే! ఆ తర్వాత ఆయన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ అడ్వెంచరస్ యాక్షన్ త్రిల్లర్ (SSMB29) చేయనున్నాడు. ఆర్ఆర్ఆర్తో జక్కన్న సూపర్ బ్లాక్‌బస్టర్ అందుకోవడం, మహేశ్ బాబుకీ జాతీయంగా మంచి క్రేజ్ ఉండడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించే ఈ సినిమాని తెరకెక్కించేందుకు జక్కన్న ప్రణాళికలు రచిస్తున్నాడని వార్తలొస్తున్నాయి.… -
Progress report: మే నెల ‘సర్కారు వారి’దే!
గడిచిన నాలుగు నెలలతో పోల్చితే మే లో తక్కువ సినిమాలు విడుదలయ్యాయి. స్ట్రయిట్, డబ్బింగ్, ఓటీటీ సినిమాలతో కలిపి కేవలం 17 చిత్రాలే జనం ముందుకు వచ్చాయి. విశేషం ఏమంటే పలు చిన్న సినిమాల నడుమ ‘సర్కారు వారి పాట’, ‘ఎఫ్ 3′ రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక వీక్ వైజ్ గా చూసుకుంటే మే 6వ తేదీ ఏకంగా ఏడు సినిమాలు ఇటు థియేటర్లలో, అటు ఓటీటీలో సందడి చేశాయి. చాలా… -
SSMB28: మహేశ్ బాబు ‘డబుల్ ధమాకా’!
‘సర్కారు వారి పాట’తో ఘనవిజయం సొంతం చేసుకున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌లో చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరిలోనే ముగియగా.. జులై రెండో వారం నుంచి సెట్స్ మీదకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై క్రేజీ వార్తలు ఒక్కొక్కటిగా తెరమీదకొస్తున్నాయి. లేటెస్ట్గా ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడని ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇదో పీరియాడిక్ డ్రామా… -
Mahesh – Trivikram movie: అది అవాస్తవమంటున్న తారకరత్న
నందమూరి తారకరత్న ప్రస్తుతం క్రిష్ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ‘9 అవర్స్’ అనే వెబ్ సీరిస్ లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జూన్ 2 నుండి ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే అతను నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘సారథి’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని సినిమాలలోనూ తారకరత్న నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మహేశ్ బాబు, త్రివిక్రమ్ మూవీలో తారకరత్న…
తాజావార్తలు
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
Dhanteras 2026: లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది..?
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..