సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో కూల్ అండ్ కామ్ గా ఉండే హీరో ఎవరు అంటే టక్కున మహేష్ అని చెప్పేస్తారు. వివాదాల జోలికి పోడు, నెగెటివ్ కామెంట్స్ చేయడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. ఈవెంట్ ఏదైనా మహేష్ మాత్రం మితంగానే మాట్లాడతాడు. అనవసరమైన హైప్ ఇవ్వదు.. అనవసరమైన ప్రామిస్ లు చేయడు. వేదికల మీద డైలాగ్స్, స్టెప్పులు వేసింది కూడా ఇప్పటివరకు లేదు అంటే…
కర్నూలులో జరిగిన సర్కారు వారి పాట సక్సెస్ మీట్లో భాగంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు వేదికపై తొలిసారి స్టెప్పులేసి, ఆ ప్రాంగణాన్ని హుషారెత్తించారు. ఆ తర్వాత ప్రసంగిస్తూ.. తనకోసం తరలివచ్చిన మీ (ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ) కోసమే తాను మొదటిసారి స్టేజ్‌పై డ్యాన్స్ చేశానని అన్నారు. అప్పుడెప్పుడో ఒక్కడు షూట్ కోసం కర్నూల్ వచ్చానని, ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత సర్కారు వారి పాట సక్సెస్ మీట్ కోసం వచ్చిన తనని చూసేందుకు ఇంతమంది అభిమానులు రావడం చాలా…
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంది. జూన్ 3న ఈ చిత్రాన్ని ఈ రెండు భాషలతో పాటు మలయాళంలోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణం.. ఇలా అతని…
ఈవెంట్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలావరకు సెటిల్డ్‌గానే ఉంటారు. వస్తారు, అభిమానుల్లో జోష్ నింపే ప్రసంగం ఇస్తారు, వెళ్ళిపోతారు.. అంతే తప్ప స్టెప్పులేసిన దాఖలాలు లేవు. అలాంటి మహేశ్.. తొలిసారి కర్నూలులో జరిగిన ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌లో మీట్లో వేదికపై స్టెప్పులేశారు. తొలుత తమన్ వేదికపైకి వెళ్ళి డ్యాన్సర్లతో స్టెప్పులు కలపగా, ఆ వెంటనే మహేశ్ స్వయంగా వేదికెక్కి తన ‘మ మ మహేశ్’ పాటకి ఎనర్జిటిక్‌గా స్టెప్పులు వేశారు. దీంతో, ఆ ప్రాంగణం…
మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ అన్ని చోట్ల మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ కర్నూలులో మ.. మ.. మాస్ సెలబ్రేషన్స్ నిర్వహిస్తోంది. ఈ వేడుకను ఎన్టీవీలో లైవ్ ద్వారా వీక్షించాలంటే కింది యూట్యూబ్ లింక్‌ను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=NOx-CqEBHms
చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు కు ఉన్న లేడీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఛార్మింగ్ లుక్, ఆయన కామెడీ టైమింగ్ కు లేడీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఇక మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో హీరోయిన్లు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికి చాలామంది హీరోయిన్లు మహేష్ సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక నేను కూడా మహేష్ బాబు అభిమానినే అని నిరూపించుకొంది ఫిదా బ్యూటీ సాయి పల్లవి..…
ఈ గురువారం (మే 12) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సర్కారు వారి పాట’కు సర్వత్రా పాజిటివ్ టాక్ రావడంతో.. ఇది బాక్సాఫీస్‌పై తాండవం చేస్తోంది. ఫలితంగా.. రెండో రోజుల్లోనే రూ. 100 కోట్ల (గ్రాస్) క్లబ్‌లోకి చేరిపోయింది. తమ సినిమా రెండు రోజుల్లోనే రూ. 103+ కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని, స్వయంగా చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా ధృవీకరించింది. దీంతో, రెండు రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిన తొలి రీజనల్ సినిమాగా ‘సర్కారు వారి పాట’ ఆల్‌టైమ్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఎలాంటి బాంబ్ పేలుస్తుందో ఎవరు ఊహించలేరు. బాలీవుడ్ మొత్తం ఒకవైపు ఉంటే .. కంగనా ఒక్కత్తే ఒకవైపు ఉంటుంది.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న విషయం విదితమే. తనను బాలీవుడ్ భరించలేదు అన్న మాటలను తప్పుగా అర్ధం చేసుకొని బాలీవుడ్ మీడియా వాటిని కాంట్రవర్సీ చేసి డిబేట్ లు పెడుతున్న విషయం విదితమే. ఇక తాజాగా కంగనా ఈ వ్యాఖ్యలపై…
సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. దీంతో వీకెండ్ వరకు ఈ సినిమాకు టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా రూ.36.63 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. వెండితెరపై మహేష్ బాబు సినిమా విడుదలై రెండు సంవత్సరాల నాలుగు నెలలు…
సూపర్ స్టార్ మహేష్‌బాబు ఖాతాలో మరో హిట్ పడింది. సర్కారు వారి పాట సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మహేష్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. తొలిరోజు న్యూట్రల్ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా వసూళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయి. ఈ సినిమా మహేష్ అభిమానులతో పాటు పవర్‌స్టార్ అభిమానులకు కూడా కిక్కిస్తోంది. ఎందుకంటే ఈ మూవీలో ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ చిత్రం భీమ్లా నాయక్‌లోని ఓ పాట వినపడుతుంది. Harish Shankar: మైత్రీ మూవీ మేకర్స్…