అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మేజర్’. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. జూన్ 3 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాను జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా తో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించిన విషయం విదితమే. ఇక రిలీజ్ రేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషనల్ వేగాన్ని పెంచేసింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో అడివి శేష్ ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మహేష్ గారు మూవీ చూసిన తరువాత మీతో చెప్పిన వర్డ్స్ కావొచ్చు, కాంప్లిమెంట్స్ కావొచ్చు ఏంటి..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అడివి శేష్ సమాధానం ఇస్తూ “ఆయన గెశ్చర్ కనిపించింది.. మాటలు కన్నా.. 30 నిముషాలు ఏమి మాట్లాడలేకపోయారు. గొంతు ఎండిపోయి ఒక 5 నిమిషాల తరువాత కన్నీళ్లు పెట్టుకొని మాతో మాట్లాడం మొదలుపెట్టారు.. ఆ స్పేస్ లో మాతో మాట్లాడారు.. అంతే అంతకుమించి రియాక్షన్ ఏమి ఉంటుంది” అని చెప్పుకొచ్చాడు.
ఇక మహేష్ కళ్ళలో ఆ కన్నీళ్లు చూసినప్పుడు మీకేమి అనిపించింది అన్న ప్రశ్నకు “నిజం చెప్పాలంటే మాకు చాలా టెన్షన్ ఉంది.. సర్ కు అస్సలు ఎలా నచ్చుతుంది.. ఏమంటారు అని.. ట్రైలర్ చూడగానే ఓకే మనం జెన్యూన్ గా ఉన్నాం.. కరెక్ట్ గా ఉన్నాం. మేము కూడా వేసిన స్ట్రాటజీ ఏంటంటే.. ఇది సర్ కు కూడా తెలియదు.. రేపు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం అన్న ముందు రోజు సర్ కు చూపించాం. ఆయన హానెస్ట్ రివ్యూస్ అందరికి తెలుసు.. ఆయనకు నచ్చకపోతే ట్రైలర్ వెంత్ కు వచ్చేవారు కాదు. అంత రిస్క్ ఉన్నా కూడా మేము చూపించాం.. ఎందుకంటే మాకు తెలుసు ఈ సినిమా ఏంటి.. మేజర్ సందీప్ కథ ఏంటి అనేది.. అందుకే దైర్యంగా ఉన్నాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.