Major Success Meet: వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మేజర్’ ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. హీరోగా అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభిత ధూలిపాళ్ల నాయికలుగా నటించారు. తాజాగా హైదరాబాద్‌లో ‘మేజర్’ సక్సెస్‌మీట్ నిర్వహించారు. ‘మేజర్ సందీప్‌కు మేమిచ్చిన నివాళి ఈ సినిమా అంటూ అడివి శేష్ అన్నారు. ఇదొక ఆరంభం మాత్రమే. ఇలాంటి గొప్ప చిత్రాలను ఇంకా రూపొందించాలని అనుకుంటున్నాం. ఈ సినిమా చూసి సైన్యంలో చేరుతామనంటూ చాలా మంది చెప్పడం సంతోషంగా ఉంది. సైన్యంలోకి వెళ్లాలనుకుని, పేదరికంతో సరైన శిక్షణ లేని వాళ్లందరికీ మేము ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా మేజర్ సందీప్ పేరుమీదే చేస్తాం’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ…‘మేజర్ సందీప్ మా టీమ్‌ను నడిపించాడు. ఆయన ఒక సైనికుడిగా ఎంత గొప్పగా బతికాడో మా సినిమా ద్వారా చూపించడం గర్వంగా ఉంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ వీర సైనికుడికి నివాళి అర్పిస్తున్నారు’ అన్నారు.
ఇక అది అలా ఉంటే ఈ సినిమాను చూసిన అల్లు అర్జున్ మేజర్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ సినిమా గుండెకు హత్తుకుంది. మ్యాన్ ఆఫ్ ది షో అడివి శేష్ మరోసారి తన మ్యాజిక్ చేశారు. కథలో కీలక పాత్రల్లో నటించి ప్రకాష్ రాజ్, రేవతి, సయీ మంజ్రేకర్, శోభితా దూళిపాల చక్కని సపోర్ట్ ఇచ్చారు. దర్శకుడు శశి కిరణ్ తిక్కా తన ప్రతిభ చూపించారు. శ్రీచరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరింది. ప్రేక్షకులకు ఇంత మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత మహేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలంటూ అభినందించారు. దీనికి స్పందించిన హీరో అడివి శేష్.. థాంక్యూ.. మీ ప్రేమకు చాలా ధన్యవాదాలు అల్లు అర్జున్. క్షణం నుండి మేజర్ వరకు మీ సపోర్ట్ మరవలేనిది అంటూ బదులిచ్చారు.
Also Read
Big congratulations to the entire team of #MajorTheFilm. A very heart touching film . Man of the show @AdiviSesh does his magic once again. Impactful support by @prakashraaj ji , Revathi , @saieemmanjrekar, #SobhitaDhulipala & all artists . Mind blowing Bsm by @SricharanPakala
— Allu Arjun (@alluarjun) June 4, 2022
ఇక ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్‌లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియాతో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు.
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్‌కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?