తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళంలో తాను మాట్లాడలేకపోవడం బాధగా ఉందన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు క్షమాపణలు కోరారు.
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరగుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి.
పాకిస్థాన్‌లో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు 62 మంది హిందువులు బుధవారం భారత్ నుంచి వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నారు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి బుధవారం నాడు మొత్తం 62 మంది హిందూ యాత్రికులు లాహోర్ చేరుకున్నారని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) ప్రతినిధి అమీర్ హష్మీ తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో నేటి నుంచి మహశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు.
తెలంగాణలోనే అతిపెద్ద ప్రసిద్ద పుణ్యక్షేత్రం మైనా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం మహా శివరాత్రి జాతర వేడుకలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు సుమారు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో మహా శివరాత్రి జాతర ప్రారంభమైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు జాతర కొనసాగనుంది. రేపు మహా శివరాత్రి ఉత్సవాలకు దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.