తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళంలో తాను మాట్లాడలేకపోవడం బాధగా ఉందన్నారు. అక్కడికి వచ్చిన భక్తులకు క్షమాపణలు కోరారు. మహాశివరాత్రి నాడు తనకు ఆది శివుని దర్శనం లభించిందని.. అందుకు సద్గురుకి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో ముగుస్తుందని.. ఈరోజు కోయంబత్తూరులో భక్తి మహా కుంభమేళా జరుగుతోందని అమిత్ షా చెప్పారు.
READ MORE: Kishan Reddy : హైదరాబాద్ గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మా హబ్‌గా ఎదుగుతోంది
“ఈ రోజు శివుడు, పార్వతులు కలిసిన దినం. ఇక్కడ శివుడు ఆదియోగి రూపంలో కూర్చుని దర్శనమిస్తున్నాడు. ఆయన వివిధ రూపాల్లో దర్శనమిస్తుంటాడు. సద్గురు గారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. భక్తి, యోగా కోసం ఆయన అభివృద్ధి చేసిన ఈ ప్రదేశం మానవాళికి గొప్ప సేవగా తయారైంది. ఈ 112 అడుగుల ఎత్తైన ఆదియోగి విగ్రహం 112 ఆధ్యాత్మిక మార్గాలను చూపుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే శివత్వమే అంతిమ లక్ష్యం అని గ్రహిస్తారు. ఈశా యోగా… యువతను దేవునితో అనుసంధానించే మాధ్యమంగా మారింది. సద్గురు యువతను మతంతో అనుసంధానించడమే కాకుండా వారికి మతం యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించారు. ఈ రోజు, సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రజలకు జీవించే మార్గాన్ని బోధిస్తున్నారు. మీ ద్వారా ప్రపంచం మొత్తం సనాతన ధర్మాన్ని అర్థం చేసుకునే అవకాశం లభించింది. మీ ద్వారా ప్రపంచం మొత్తం పర్యావరణం గురించి సందేశాన్ని అందుకుంది.” అని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.
READ MORE: Aadhi Pinisetty: ‘శబ్దం’ డిఫరెంట్ స్క్రీన్ ప్లే వున్న హారర్ ఫిల్మ్: హీరో ఆది పినిశెట్టి ఇంటర్వ్యూ
సద్గురు.. ప్రపంచం ముందు జాతీయ ఆస్తిగా ఎదిగారని.. ఆదియోగం ద్వారా యోగాకు గుర్తింపు ఇచ్చారని అమిత్ షా అన్నారు. మోడీ యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి వివరించారన్నారు. యోగా పురాతనమైనది కానీ.. ఇప్పటి జనాలకు తప్పకుండా అవసరమని తెలిపారు. యోగా భక్తికి మార్గం సుగమం చేస్తుందని… ఒకరిని దైవంతో అనుసంధానిస్తుందన్నారు. తమిళ చరిత్ర లేకుండా భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతిని వివరించడం సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. మహర్షి తిరుమూలన్ మన వేదాలలోని 3000 కంటే ఎక్కువ శ్లోకాలను అధ్యయనం చేశారని గుర్తు చేశారు.