సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో దర్శనం ఇచ్చింది. ప్రధానీ నరేంద్ర మోడీ బ్యానర్‌పై అదే పనిగా ఓ వ్యక్తి రాయి విసురుతూ కనిపించాడు. దీంతో అక్కడ భారీగా జనం గుమికూడి అతడిని వింతగా చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్ర నాగపూర్‌లో జరిగినట్టుగా సమాచారం. ఈ వీడియో ఓ వ్యక్తి స్థానిక బస్టాప్ వద్ద ప్రధాని మోదీ బ్యానర్‌ను చూశాడు. బీజేపీ ఏర్పాటు చేసిన వికాసిత్ భారత్ సంకల్ప…
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 23 సీట్లు కావాలన్న మిత్రపక్షం శివసేన (యూబీటీ) డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. లోక్‌సభ ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ భాగస్వాములైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించడానికి నాయకులు సమావేశమైన తర్వాత ఈ పరిణామం జరిగింది.
దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా పాకుతుంది. మళ్లీ కరోనా కేసులు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. మహారాష్ట్రలో కొత్తగా 87 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనాతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. కాగా.. ముంబైలో 19 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పూణె, సాంగ్లీ జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇదిలా ఉంటే.. నిన్న రాష్ట్రంలో 37 మందికి కరోనా సోకింది. మార్చి 2020 నుండి…
Uddhav Thackeray: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే 2024 ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జైన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం నియంతృత్వం ముందు ఉందని అన్నారు. భారతదేశ స్వేచ్ఛను రక్షించే సమయం ఆసన్నమైందని అన్నారు. తూర్పు ముంబైలోని కుర్లాలో సోమవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Food Poisoning: పెళ్లి భోజనాలు తిన్న వారికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఈ ఘటన మహారాష్ట్రాలోని నాగ్‌పూర్‌లో జరిగింది. నగర శివార్లలోని ఓ రిసార్టులో జరిగిన పెళ్లి కార్యక్రమంలో వడ్డించిన ఆహారం తిన్న 80 మంది వ్యక్తులకు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారని, వీరింతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఈ రోజు పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని కసర రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాలుగింటిని దారి మళ్లించినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు గ్లోబల్ టెర్రర్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కుట్ర చేసిందనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ కర్ణాటక, మహారాష్ట్రలోని దాదాపు 44 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
Maharashtra: తనను ఆటపట్టిస్తుందని 8 ఏళ్ల బాలికను చంపేసిన బాలుడు..తన పక్కింట్లోనే ఉండే 8 ఏళ్ల బాలికను 16 ఏళ్ల బాలుడు దారుణంగా హత్య చేశాడు. పదేపదే తనను ఆటపట్టిస్తుందని, ఏడిపిస్తుందనే కారణంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెల్హార్ గ్రామంలో డిసెంబర్ 1న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన 3 రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
షిర్డీ సాయిబాబా టెంపుల్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోని బంగారు, వెండి నిల్వలను కరిగించి నాణేలు తయారు చేసి భక్తులకు విక్రయించాలని నిర్ణయించింది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందట. కాగా దేశంలోని ప్రముఖ ఆలాయాల్లో షిర్డీ సాయిబాబు టెంపుల్ ఒకటి. షిర్డీకి బాబాకు దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం వచ్చి బాబాను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయికి…
Telangana Elections2023: మావోయిస్టు ప్రాబల్యం ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలోని 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే 4 గంటల్లోపు పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికి ఉన్న ప్రజలకు మాత్రం అవకాశం ఉంటుంది. 4 గంటల తర్వాత వచ్చే వారిని అధికారులు అనుమతించరు..