మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా గుహ గ్రామంలో కొందరు ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు భక్తులను, పూజారిని కొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఈనెల 9న లార్డ్ కనిఫ్నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు, పూజారిపై ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం దీపావళి బోనస్ ఇవ్వడానికి నిరాకరించినందుకు దాబా యజమానిని అందులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కొట్టి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి బోనస్‌ను ఇవ్వడానికి యజమాని తిరస్కరించడంతో శనివారం తెల్లవారుజామున నాగ్‌పూర్ గ్రామీణ ప్రాంతంలోని కుహి ఫాటా సమీపంలోని ధాబా వద్ద అతని ఉద్యోగులు గొంతు కోసి, కత్తితో పొడిచి, కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
Maharastra: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు వంతెనపై నుండి కింద ప్రయాణిస్తున్న గూడ్స్ రైలుపై పడింది.
Nagpur: ఏదో సినిమాలో చెప్పినట్లు ఒక హిందువు ఈశ్వరుడిని, ముస్లిం అల్లాను, క్రిస్టియన్ ఏసు ప్రభువునే మొక్కుతారు, కానీ అన్ని మతాల వాళ్లు డాక్టర్ని ప్రార్థిస్తారని హీరో డైలాగ్ చెబుతాడు. ఇది నిజం అనారోగ్యంతో వచ్చిన వ్యక్తికి డాక్టరే దేవుడు. ఇలాంటి ఆదర్శప్రాయమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ డాక్టర్ మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ‘టీ’ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.
Maharashtra: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ల ఉద్యమమం రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటూ ఉంది. ఇప్పటికే ఉద్యమం లో పాల్గొన్న చాలామంది ఉద్యమకారులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను కోల్పోయారు. కాగా ఈ రోజు మరో నలుగురు విషం తాగి ఆత్మహత్యకు పాలపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మరాఠా కమ్యూనిటీకి OBC రిజర్వేషన్లు ఇవ్వాలంటూ జరుగుతున్న ఉద్యమానికి.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరాంగేకి మద్దతు తెలుపుతూ 26 ఏళ్ల యువకుడు రంజిత్ మంజరే విషం తాగాడు. ఈ…
మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమం ఇప్పుడు మహారాష్ట్రలో శరవేగంగా వ్యాపిస్తోంది.
నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, నిప్పంటించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్‌లో ఆయన బంగ్లాలో భారీ మంటలు, పొగలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు కనిపించింది.
యూపీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖను నిర్వహించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలలో.. మహారాష్ట్రకు చెందిన కొంతమంది రైతుల పేరుతో రాజకీయాలు చేశారని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అన్నారు.