Election Results 2024 Live UPDATES: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 48 శాసనసభ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా.. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మీ కోసం లైవ్ అప్డేట్స్..
మహారాష్ట్రలో ఎన్డీఏ, జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం
మహారాష్ట్రలో సంచలన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి
మహారాష్ట్రలో 230 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం
మహారాష్ట్రలో 51 స్థానాలకే పరిమితమైన మహా వికాస్ అఘాడీ
శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేకు మరోసారి తప్పని భంగపాటు
జార్ఖండ్‌లో మరోసారి పట్టు నిలుపుకున్న ఇండియా కూటమి
జార్ఖండ్‌లో 56 స్థానాల్లో విజయం సాధించిన ఇండియా కూటమి
జార్ఖండ్‌లో 24 స్థానాలకే పరిమితమైన బీజేపీ కూటమి
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి కసరత్తు
మహారాష్ట్రలో మహాయుతి విజయోత్సవాలు
కాసేపట్లో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోడీ
మహారాష్ట్ర విజయంపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయంపై ప్రధాని మోడీ స్పందించారు. 'అభివృద్ధి గెలిచింది, సుపరిపాలన గెలిచింది. మహారాష్ట్ర సోదర సోదరీమణులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్డీయేకు ప్రజలు చారిత్రాత్మకమైన ఆదేశాన్ని, ప్రేమను అందించారు.' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. మరోవైపు.. జార్ఖండ్ ప్రజలకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు జేఎంఎం కూటమికి అభినందనలు తెలిపారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ దుమ్కాలో 14,588 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సునీల్ పై విజయం సాధించారు.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో “ఇండియా కూటమి” దూసుకెళ్తుంది. ప్రస్తుతం 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా.. గాండే స్థానం నుండి ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ జైలులో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 పైగా పార్టీ సభలను నిర్వహించింది కల్పనా సొరేన్.
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె 'X'లో పోస్ట్ చేశారు. 'పార్లమెంట్‌లో మీ గొంతుకు అవుతాను.. ప్రచారంలో పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు.. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేశారు' అని తెలిపారు. 'నా తల్లి, భర్త, పిల్లలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు.. నా వెనక ఉండి నడిపించినందుకు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు. గత వయనాడ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి 3 లక్షల 64 వేల ఓట్ల మెజారిటీ రాగా.. ప్రస్తుతం ప్రియాంక గాంధీకి 4 లక్షల 10వేలకు పైగా మెజారిటీ వచ్చింది.
యూపీ ఉపఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలో ఏడింటిలో బీజేపీ కూటమి గెలుపొందింది. రెండు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి లూట్ ఔర్ జూట్ ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని తెలిపారు.
జార్ఖండ్‌లో JMM, కాంగ్రెస్ పార్టీ సంయుక్త విజయమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారం అబద్ధమని ప్రజలు స్పష్టం చేశారని ఆయన తెలిపారు.
కర్నాటక ఉప ఎన్నిక: 3 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలుపు
బీహార్: 4 అసెంబ్లీ సీట్లలోనూ ఎన్డీఏ గెలుపు
పంజాబ్: 3 అసెంబ్లీ సీట్లలో ఆప్ గెలుపు
బెంగాల్: 6 అసెంబ్లీ సీట్లలోనూ తృణమూల్ గెలుపు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాయుతి' కూటమి బలమైన మెజారిటీ దిశగా దూసుకుపోతుంది. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను తదుపరి ముఖ్యమంత్రిని చేస్తారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గియా అన్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలన్నారు.
సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా రాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌పై ఎంత ప్రజావ్యతిరేకత ఉందో అర్థమవుతుంది.. కాంగ్రెస్ కులం, మతం పేరుతో ప్రచారం చేసిందని అన్నారు. రాహుల్‌గాంధీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని కిషన్ రెడ్డి తెలిపారు.
జార్ఖండ్‌లో ఇండియా కూటమి తిరిగి అధికారంలోకి రానుంది. జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి దూసుకెళ్తుంది. ఇప్పటికే 51 స్థానాల్లో ఇండియా కూటమి విజయం సాధించినట్లు అధికారిక ప్రకటన వెలువడైంది. ప్రస్తుతం 55 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉండగా.. 25 స్థానాలకు NDA కూటమి పరిమితమైంది. ఈ క్రమంలో.. సీఎంగా JMM వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరేన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇండియా కూటమి JMM 31, కాంగ్రెస్ 14, ఆర్జేడీ 4, సీపీఐ 2 స్థానాల్లో విజయం సాధించాయి.
భారీ విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు దేవేంద్ర ఫడ్నవీస్ ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు మహాయుతిని ఆదరించారు.. మాహా వికాస్ అఘాడీ అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. మతం ఆధారంగా ఓట్లు అడిగిన అఘాడీ కూటమిని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. షిండే శివసేననే అసలైన శివసేనగా మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని ఫడ్నవీస్ అన్నారు.
మహాయుతిలో అతి పెద్ద పార్టీగా బీజేపీ.. బీజేపీకి 130 సీట్లు, మ్యాజిక్ ఫిగర్- 145.. ఈ నెల 26లోగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై కొనసాగుతున్న ఉత్కంఠ.. రేసులో ఫడ్రవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్..
వయనాడ్ లో ప్రియాంక గాంధీ విజయం సాధించడంపై రాబర్ట్ వాద్రా స్పందించారు. ప్రియాంక కృషిని గుర్తించిన కేరళ ప్రజలకు ధన్యవాదాలు.. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.. నాకూ అలాంటి సమయం రావొచ్చు.. ప్రజల కోసం నేను శ్రమిస్తూనే ఉంటా.. ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది- రాబర్ట్ వాద్రా
డేరాబాబా నానక్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం.. 5,699 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన గురుదీప్ సింగ్
కేరళలోని పాలక్కడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి ప్రభజనంపై తొలిసారి స్పందించారు. ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’(కలిసి ఉంటేనే సురక్షితం), ప్రధాని మోడీ ఉంటే అన్ని సాధ్యమే అని ట్వీట్ చేశారు.
एक है तो ‘सेफ’ है !
मोदी है तो मुमकिन हैं ! #Maharashtra #महाराष्ट्र— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 23, 2024
మహారాష్ట్రలో షిండే ఫిటింగ్.. అతిపెద్ద పార్టీకే సీఎం పదవి ఇవ్వాలని రూలేంలేదు.. అందరం కూర్చొని ముఖ్యమంత్రి ఎవరికివ్వాలన్నది నిర్ణయిస్తాం.. మహారాష్ట్ర సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ.. రేసులో ఫడ్నవీస్ ముందంజ.. అజిత్ పవార్ కు సీఎం పదవి ఇవ్వాలంటూ ఆయన వర్గం డిమాండ్.. ఈ నెల 26లోగా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి..
బారామతి ప్రజలు అజిత్ పవార్ను సీఎంగా చూడాలనుకుంటున్నారు.. నేను అజిత్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నా- అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్
ఏక్నాథ్ షిండేనే మళ్లీ సీఎం అవుతారు.. స్పష్టం చేసిన షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే..
మహారాష్ట్రలో మహాయుతి నేతలకు అమిత్ షా ఫోన్.. షిండే, పవార్ తో మాట్లాడిన అమిత్ షా.. మహాయుతి నేతలకు అభినందనలు తెలిపిన అమిత్ షా..
వయనాడ్ ఎన్నికల ఫలితాల్లో ప్రియాంక గాంధీ రికార్డ్.. వయనాడ్ లో రాహుల్ గా్ంధీ రికార్డ్ బ్రేక్ చేసిన ప్రియాంక.. గతంలో రాహుల్ కి 3 లక్షల 64 వేల ఓట్ల మెజార్టి.. 4 లక్షల మెజారిటీ దిశగా దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. ప్రస్తుతం ప్రియాంక గాంధీ మెజారిటీ 3 లక్షల 72 వేల ఓట్లు.. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక..
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ.. ‘‘ అంతిమ ఫలితాలు రానివ్వండి, మేం కలిసి పోరాడిన విధంగానే, మూడు పార్టీలు (బీజేపీ-శివసేన షిండే- ఎన్సీపీ అజిత్ పవార్) కలిసి కూర్చుని సీఎం ఎవరు కావాలనే దానిపై కూర్చుని మాట్లాడుతాం.
#WATCH | Thane | Maharashtra CM & Shiv Sena leader Eknath Shinde says, "Let the final results come in...Then, in the same way as we fought elections together, all three parties will sit together and take a decision (on who will be the CM)." pic.twitter.com/q6hxe8Wyvn
— ANI (@ANI) November 23, 2024
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి నుంచి ముందంజలో ఉన్నారు. అజిత్ పవార్, బారామతి ప్రజలకు ఇది గొప్ప రోజుగా ఆయన భార్య సునేత్రా పవార్ అభివర్ణించారు. అజిత్ దాదాకు మద్దతు ఇచ్చింనందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇది బారామతి ప్రజలు విజయంగా కొనియాడారు. ప్రజలు కోరుకున్నదే (అజిత్ పవార్ సీఎం కావాలి) నేను కోరుకుంటున్నాను అని అన్నారు.
#WATCH | Baramati, Maharashtra | As NCP leader & Maharashtra Deputy CM Ajit Pawar leads in Baramati, Sunetra Pawar says, "It is a very fortunate day for Ajit dada, NCP, for the public and Baramati. I thank the people of Baramati for extending their support to Ajit dada. This is… pic.twitter.com/SsOmwcXRZY
— ANI (@ANI) November 23, 2024
ప్రియాంక గాంధీకి భారీ మెజార్టీ ఇచ్చిన వయనాడ్ ప్రజలు.. 3 లక్షల ఓట్ల మెజార్టీ దాటిన ప్రియాంక.. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మెకెరి.
నేను ముందు చెప్పిందే జరిగింది.. మహాయుతికి బంఫర్ మెజార్టీ వచ్చింది.. మహిళలకే ఈ విజయం అంకితం.. మహిళలకు నా ధన్యవాదాలు.. మహాయుతి కూటమి పనులకు ఇది నిదర్శనం-ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్రలో మరోసారి ఎన్డీయే కూటమి విజయకేతనం.. ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ.. సంబరాల్లో మునిగిపోయిన మహాయుతి కూటమి శ్రేణులు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే కసరత్తు.. బీజేపీ కూటమి 222, కాంగ్రెస్ కూటమి 53, ఇతరులు 13 స్థానాల్లో ఆధిక్యం
వయనాడ్ లో భారీ మెజార్టీ దిశగా ప్రియాంక గాంధీ.. ప్రస్తుతం 2 లక్షల 72 వేల ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక..
మళ్లీ ఇండియా కూటమిదే జార్ఖండ్.. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇండియా కూటమి.. మరోసారి ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసే అవకాశం.. జార్ఖండ్ ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్ కీలక సమావేశం
జార్ఖండ్ లో ఇండియా కూటమి గెలుపుతో కాంగ్రెస్ కీలక సమావేశం.. జార్ఖండ్ కాంగ్రెస్ ఇంఛార్జ్ గులాం అహ్మద్ నేతృత్వంలో సమావేశం.. హాజరైన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. జార్ఖండ్ లో ఎన్నికల పరిశీలకునిగా పని చేసిన భట్టి..
ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ముంబైలోని వర్లీ స్థానంలో వెనకంజలో ఉన్నారు. ఇక్కడ శివసేన(షిండే) నేత మిలింద్ దేవరా లీడ్‌లోకి వచ్చారు.
మహారాష్ట్రలో మరోసారి ఎన్డీయే పాగా.. ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజార్టి సాధించిన మహాయుతి.. సంబరాల్లో మునిగిపోయిన బీజేపీ కూటమి..
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి భారీ ఆధిక్యం లభిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్.. ప్రియాంక గాంధీ పార్లమెంటులో అడుగు పెట్టబోతుంది- రేవంత్
కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీకి భారీ ఆధిక్యం.. 2 లక్షల మెజార్టీ ఇచ్చిన వయనాడ్ ప్రజలు
మహారాష్ట్రలో బీజేపీ విజయదుందుభి మోగించింది.. గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తాం.. మహారాష్ట్రలో మోడీ అభివృద్ధి మంత్రం పని చేసింది.. ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత కనిపించింది.. రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయింది.. తెలంగాణలోనూ కాంగ్రెస్ కూ ఇదే గతి పడుతుంది- బండి సంజయ్
ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ కు ప్రధాని మోడీ.. విజయోత్సవాలకు సిద్ధమై బీజేపీ..
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ అవుతార అని తెలిపిన బీజేపీ నేత ప్రవీణ్ దారేకర్.. ఏక్ నాథ్ షిండే వర్గం నిర్ణయంపై ఉత్కంఠ.. సీఎం పదవిని వదులుకునే ప్రసక్తే లేదన్న షిండే వర్గం.. ముంబైలో ఫడ్నవీస్ నివాసంలో కీలక సమావేశం.. హాజరైన బీజేపీ అగ్రనేతలు.. రాష్ట్రంలో బీజేపీ అత్యుత్తమ ప్రదర్శన.. సీఎం పదవిని ఫడ్నవీస్ చేపట్టాలని బీజేపీ నేతల డిమాండ్..
ఉత్తరప్రదేశ్ లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీ-6, ఎస్పీ-2, ఆర్ఎల్డీ-1 స్థానంలో ముందంజ
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ లో బీజేపీ అభ్యర్థి నాటియాల్ లీడ్
జార్ఖండ్ లో పని చేసిన హేమంత్ సోరెన్ మంత్రం.. కలిసొచ్చిన హేమంత్ జైలు సెంటిమెంట్.. జార్ఖండ్ లో పని చేసిన రెండ్ర బ్రహ్మస్త్రాలు.. సీఎం మయ్యా యోజన కింద మహిళలకు నెలకు రూ. 2500
సరాయ్‌కెలాలో ఝార్ఖండ్ మాజీ సీఎం చంపయీ వెనుకంజ
కర్ణాటకలోని చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో హీరో నిఖిల్ కుమారస్వామి ఆధిక్యం.. జేడీఎస్ నుంచి బరిలోకి నిలిచిన ఆయన 783 ఓట్ల లీడింగ్
జార్ఖండ్ లో అధికారం దిశగా ఇండియా కూటమి.. స్పష్టమై మెజార్టీ దిశగా దూసుకెళ్తున్న కాంగ్రెస్.. రాంచీలో కాంగ్రెస్ నేతలతో భట్టి విక్రమార్క భేటీ.. ఎప్పటికప్పుడు ఫలితాల సరళిపై ఆరా.. 50 స్థానాల్లో ఇండియా బ్లాక్.. 29 స్థానాల్లో బీజేపీ ముందంజ
కాంగ్రెస్ కంచుకోట విదర్భలో ఇండియా కూటమికి పరాభవం.. 47 సీట్లలో మహాయుతి ఆధిక్యం.. 7 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ..
మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి హవా.. 210కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో మహాయుతి.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్- 145.. మహారాష్ట్రలో ఇండియా కూటమికి ఘోర పరాభవం.. శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలను ఓడించిన మరాఠీలు.. ఫలించని శరద్ పవార్ వ్యూహాలు..
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు.. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది.. ఈవీఎంలను ట్యాపరింగ్ చేశారు.. ఇది ప్రజాతీర్పు కాదు.. అజిత్ పవార్, ఏక్ నాథ్ షిండే చేసిన ద్రోహంపై.. మహారాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. లోక్ సభ ఎన్నికల్లో మాకు స్పష్టమైన ఆధిక్యం వచ్చింది.. ఇప్పుడెలా ఫలితాలు మారాయి- సంజయ్ రౌత్
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ లీడ్.. లక్ష మెజార్టీని దాటిన ప్రియాంక గాంధీ.. ఇక, ఫలితాల్లో మొదటి నుంచి వెనుకంజలో కొనసాగుతున్న బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్..
మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.. వచ్చే ఐదేళ్లు ఇదే అభివృద్ధి కొనసాగుతుంది.. మాపై ఇండియా కూటమి పార్టీలు దుష్ప్రచారం చేశాయి- జీవీఎల్
మహారాష్ట్రలో మహాయుతి కూటమికి బంఫర్ మెజార్టీ ఇచ్చిన లాడ్లీ బహనా యోజన.. బ్రహ్మండంగా పని చేసిన మోడీ మంత్రం.. కులగణనకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ ప్రచారం.. ఏక్ తో సేఫ్ హై అనే నినాదం ఇచ్చిన మోడీ..