మహారాష్ట్రలో సూపర్ మార్కెట్లో వైన్ అమ్మేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిసై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సూపర్ మార్కెట్లో వైన్ విక్రయాలకు వ్యతిరేకంగా అవిరామంగా నిరసన దీక్ష చేస్తామని హెచ్చరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దురదృష్టకరమని అన్నారు. ప్రజలతో మద్యం మాన్పించాల్సిన ప్రభుత్వం, వారిని మద్యానికి బానిసలుగా చేయడం విచారకరమని, ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తనకు ఎంతగానో బాధ కలిగించిందని అన్నారు.
Read: షాకింగ్: మరణించాడని పోస్ట్‌మార్టం చేయబోతే…లేచికూర్చున్నాడు…
సూపర్ మార్కెట్లు, పెద్ద స్టోర్లలో వైన్ అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. అయితే, ఇది దేవాలయాలు, విద్యాసంస్థల వద్ద ఉండే సూపర్ మార్కెట్లకు ఇది వర్తించదని స్పష్టం చేసింది. అన్నాహజారే చేసే ఉద్యమానికి అటు బీజేపీ కూడా మద్దతు పలికింది. మహారాష్ట్రను మద్యపాన రాష్ట్రంగా మారుస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు.