హిందూత్వ అనే అంశంపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య వివాదం చెలరేగింది. హిందూత్వ అంశంపై పోటీ పడి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరో అడుగు ముందుకు వేసి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అంశంపై పోటీ చేస్తున్న ఏకైక పార్టీ శివసేన అని అన్నారు. బీజేపీలోని నవ హిందూత్వవాదులకు అసలు హిందూత్వమంటే అర్థం తెలియదని, సమయం వచ్చినపుడు తప్పకుండా వారికి అర్ధాన్ని వివరిస్తామని అన్నారు. కొందరు అవివేకులు తమ చరిత్రను తామే చెరిపేసుకుంటున్నారని విమర్శించారు. దాదాపు 25 సంవత్సరాలుగా కలిసి పనిచేసిన బీజేపీ, శివసేన పార్టీలు ఇటీవలే విడిపోయాయి. శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. గత రెండేళ్లుగా సంకీర్ణ ప్రభుత్వ మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది.
Read: రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అవసరం లేదు…