మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభాక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు ముంబై పోలీసులు.. అక్రమంగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై ఆదివారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కోరుతూ ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దేవేంద్ర ఫడ్నవీస్‌కు నోటీసులు జారీ చేశారు.. ఆదివారం ఉదయం 11 గంటలకు బీకేసీ సైబర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఐపీఎస్ అధికారి రష్మీ శుక్లా రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న…
ముంబై పర్యటనలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. 1969 ఉద్యమ సమయం నుంచి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ప్రకటించారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అతి చిన్న వయసులోనే సీఎంగా పాలన సాగించిన ఘనత శరద్ పవార్‌ది అని కొనియాడారు. దేశంలోనే శరద్ పవార్ సీనియర్ నేత అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశం ప్రస్తుతం…
ముంబై పర్యటనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రాజకీయాలపై మహారాష్ట్ర సీఎంతో చర్చించినట్లు తెలిపారు. దేశ రాజకీయాలపై చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చానని.. దేశంలో మార్పులు రావాల్సి ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమే అని సీఎం…
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు.. దేశం బాగుపడాలంటే.. బీజేపీని గద్దె దింపాలని.. దేశం నుంచి తరిమివేయాలంటూ పిలుపునిచ్చిన ఆయన.. మిమ్మల్ని గద్దె దింపుతాం.. మాకు కావాల్సిన వాళ్లను తెచ్చుకుంటాం అని హెచ్చరించిన విషయం తెలిసిందే.. ఇక, బీజేపీయేతర శక్తులకు కూడగట్టే పనిలో పడిపోయారు కేసీఆర్.. అందులో భాగంగా రేపు ముంబై వెళ్లనున్నారు.. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్ చేసి లంచ్‌కు రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే…
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను అనే సాంగ్ గుర్తుంది కదా…అలానే పాపం ఓ చిరుత పులి బద్లాపూర్ జిల్లా గోరెగాన్ ప్రాంతంలోకి వచ్చింది. అడవిలోనుంచి వచ్చిన సంవత్సరం వయసున్న చిరుతపులి వాటర్ క్యాన్‌లో ఏదో ఉందనుకొని తల దూర్చింది. తలైతే దూరిందికానీ ఆ తలను వెనక్కి ఎలా తీయాలో అర్థం కాలేదు. దీంతో పాపం ఆ చిరుత నానా కష్టాలు పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 30 మంది కలిసి 48…
సమాజంలో రోజూ వార్తలు చూస్తూ ఉంటాం.. కానీ కొన్ని వార్తలు విన్నప్పుడు మాత్రం నవ్వాలో, ఏడవాలో తెలియదు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న వార్త అలాంటిదే. ఒక వ్యక్తికి రాజకీయాలంటే బాగా ఇష్టం.. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో నిలబడాలి అనుకున్నాడు. కానీ, అతనికి అప్పటికే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కారణంగా అతడికి సీటు రాలేదు. దీంతో ఎలాగైనా ఆ ఎలక్షన్స్ లో నిలబడడానికి ఆ వ్యక్తి ఒక బీభత్సమైన ఐడియా వేశాడు. తాను…
ఒకే తప్పు ఓ మంత్రికి రెండు నెలల జైలు శిక్ష విధించేలా చేసింది.. జైలు శిక్షతో పాటు జరిమానా కూడా కట్టాల్సిన పరిస్థితి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర మంత్రి బచ్చు కడూకి అమ్రావతి కోర్టు జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధించింది. దాని కారణంలో ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను దాచడం.. ఈ కేసులో ఆయన దోషిగా తేలడమే.. 2014లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బచ్చు కడూ.. అచల్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ…
ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి పోరాటానికి దిగనున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని అన్నా హజారే తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే ఈ కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఫిబ్రవరి 14 నుంచి అమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం సూపర్ మార్కెట్లలో, జనరల్ స్టోర్లలో మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Read Also: Petrol Prices: సామాన్యులకు…
గత నెలరోజులుగా మహారాష్ట్రను కరోనా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు అన్ని రంగాలు ఓపెన్ అయ్యాయి. కేసులు పెద్ద సంఖ్యలో తగ్గిపోవడంతో చాలా వరకు నిబంధనలను సడలిస్తూ వస్తున్నారు. త్వరలోనే పూర్తిస్తాయిలో నిబంధనలు సడలించే అవకాశం ఉన్నట్టు ముంబై మేయర్ ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి పూర్తిస్థాయిలో నిబంధనలు సడలించనున్నారు. అయితే, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ వంటివి పాటించాలని మేయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబైలో…