మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణం చోటు చేసుకుంది. బాత్రూమ్‌కి వెళ్ళిన ఓ బ్రిటీష్ మహిళను, వెంబడించి మరీ ఓ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం బాంద్రాలోని ఓ క్లబ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
ముంబైలోని బ్రిటీష్ రాయబార కార్యాలయంలో బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ (44) గత కొన్నేళ్ళుగా పని చేస్తోంది. మంగళవారం ఈమె తన భర్త, మరికొంతమంది స్నేహితులతో కలిసి.. బాంద్రాలోని ఓ క్లబ్‌కు వెళ్లింది. రాత్రి 11.30 గంటల సమయంలో ఆమె బాత్రూమ్‌కి వెళ్ళగా.. 35 ఏళ్ల యువకుడు ఆమెని వెంబడించాడు. అతడ్ని గమనించిన ఆ మహిళ, ఏదో తేడాగా ఉందని భావించి అక్కడినుంచి వెళ్లిపోవాలని అనుకుంది. కానీ, అతడు వెంబడించి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
వెంటనే బయటకొచ్చి జరిగిన విషయం తన భర్త, స్నేహితులకు చెప్పింది. వాళ్ళందరూ నిందితుడ్ని పట్టుకొని, అక్కడే బడితపూజ చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, వెంటనే ఘటనా స్థలికి చేరుకొని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ముందైకి చెందిన ఘనశ్యామ్ లాలాచంద్ యాదవ్‌గా గుర్తించిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఎ), 509 కింద కేసు నమోదు చేశారు.