మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేగుతున్న నేపథ్యంలో తాను మరో పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే ఖండించారు. రాష్ట్రంలోని పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, మాట్లాడేందుకు భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
NCP Poster War: అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)కి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. బుధవారం ముంబైలో జరిగిన సమావేశంలో ఆయన తన మామ శరద్ పవార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అజిత్ పవార్ కూడా పార్టీ పేరు, చిహ్నంపై దావా వేశారు.
NCP Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ప్రధానాంశంగా మారింది. ఆదివారం ఆ పార్టీ కీలక నేత అజిత్ పవార్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం సంచలనంగా మారింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం మహారాష్ట్రలోని సతారాలో తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన సోదరుడి కుమారుడు అజిత్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన ఒకరోజు తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
Eknath Shinde: మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ తో చేరారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దీన్ని ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్వాగతించారు. ఇప్పుడు మహారాష్ట్రలో ‘‘ట్రిపుల్ ఇంజన్ సర్కార్’’ ఉందంటూ వ్యాఖ్యానించారు.
శాసన మండలి సభ్యురాలు (MLC) మనీషా కయాండే ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మనీషాను ఎగతాళి చేస్తూ, సంజయ్ రౌత్ ఆమెను చెత్త అని పిలిచారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భూకంపం వస్తుందా? అంటే తాజా పరిస్థితిని బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రంలో అధికార కూటమి- ఎన్డీయేలో అనూహ్య మార్పు రావచ్చు. మూలాల ప్రకారం, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవిని సీఎం ఏక్నాథ్ షిండేతో మార్చుకోవచ్చు.
మహారాష్ట్రకు తొందరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కమలం పార్టీ ఏక్ నాథ్ షిండేకు హుకుం జారీ చేసిందని.. దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజుల పాటు సెలవులు పెట్టి వెళ్లారని క్యాస్ట్రో అన్నారు.
NCP’s Ajit Pawar joining hands with BJP..?:మహరాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గతేడాది శివసేనను చీల్చి ఏకంగా ఏక్ నాథ్ షిండే బీజేపీ సహకారంలో సీఎం అయ్యారు. ఈ రాజకీయ వేడి చల్లారకముందు ఎన్సీపీ నేత అజిత్ పవార్, సీనియర్ లీడర్ శరద్ పవార్ కు షాకిచ్చేలా కనిపిస్తోంది.