మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. వీరిద్దరి మధ్య భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన కుమారుడు, పార్టీ ఎమ్మెల్యేలు ఆదిత్య ఠాక్రే, అనిల్ పరబ్, వరుణ్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే అసంతృప్తిగా.. రాజకీయాల్లో హాట్ హాట్‌గా ఉన్న తరుణంలో ఈ భేటీ జరిగింది.
Aaditya Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ)లో విభేదాలకు కారణమవుతోంది. ఇటీవల శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేత, ఠాక్రేకి సన్నిహితుడు మిలింద్ నార్వేకర్.. బాబ్రీ మసీదు కూల్చివేత గురించి ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన 11 రోజుల తర్వాత ఉత్కంఠకు తెరపడి బుధవారం జరిగిన కీలక సమావేశంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎంపిక చేసినట్లు బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ప్రమాణస్వీకారోత్సవం ఈరోజు సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనుంది.
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ల ‘మహాయుతి’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుంది. 132 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మారింది. ఇదిలా ఉంటే, ఎన్నికల ఫలితాలు వచ్చి 10 రోజులు అవుతున్నా , మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చి వారం గడిచింది. బీజేపీ నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో 233 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాలు సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే, మహాయుతి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
మహారాష్ట్ర సీఎం పదవిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై సానుకూల చర్చలు కొనసాగాయి.. ముంబైలో మరోసారి చర్చించిన అనంతరం దీనిపై తుది నిర్ణయం ప్రకటిస్తామని ఏక్ నాథ్ షిండే వెల్లడించారు.
Maharashtra : మహారాష్ట్ర ఎన్నికల పోరులో 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. జాబితాలోని చాలా మంది పేర్లు విదర్భ ప్రాంతానికి చెందినవి.
Sharad Pawar: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ)తో కలిసి పోరాడిన శరద్ పవార్ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన వైఖరిని ప్రదర్శించింది. పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లోనే పోటీ చేశాం.. కానీ, అసెంబ్లీలో మాత్రం మా పార్టీ రాజీపడదని శివసేన, కాంగ్రెస్ పార్టీలకు స్పష్టం చేశారు.
Maharastra : రానున్న రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు కనిపించవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌పవార్ బలం పుంజుకున్న తర్వాత ఇప్పుడు అజిత్ పవార్ శిబిరం వెనకడుగు వేసింది.
Viral Video : శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శరద్ పవార్ ఠాక్రేను గది నుంచి బయటకు వెళ్లమని అడుగుతున్నారని మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.