Raj Thackeray: 13 సంవత్సరాలలో మొదటిసారిగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్ థాకరే ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే నివాసం అయిన మాతోశ్రీకి వెళ్లారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పుట్టినరోజును సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఠాక్రే చివరిసారిగా 2012లో బాలాసాహెబ్ ఠాక్రే మరణించిన సమయంలో మాతోశ్రీలోకి ప్రవేశించారు.
Nitesh Rane: మరాఠీ భాషపై ఇద్దరు సోదరులు రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయారు. 20 ఏళ్ల తర్వాత, ఒకే వేదికను పంచుకున్నారు. ఇకపై తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో త్రిభాషా విధానంలో భాగంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని ఠాక్రే సోదరులు వ్యతిరేకించారు. మరాఠీలపై హిందీ రుద్దాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.
MK Stalin: జాతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా, హిందీ భాష విధింపుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఈ వివాదమే 20 ఏళ్ల తర్వాత రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసేందుకు సాయపడింది.
Devendra Fadnavis: దాదాపు 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు తమ విభేదాలను మరిచిపోయి కలుసుకున్నారు. శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేలు శనివారం ఒకే వేదికను పంచుకున్నారు. వీరిద్దరు చివరిసారిగా 2005లో ఒకే వేదికపై కలిశారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్‌ఠాక్రే ఎంఎన్ఎస్ పార్టీని స్థాపించారు. అయితే, ఇప్పుడు వీరిద్దరిని ‘‘మరాఠీ’’ భాష కలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీని మూడో…
Raj Thackeray: 20 ఏళ్లుగా శత్రువుగా ఉన్న బంధవులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికను పంచుకుంటూ, తాము కలిసిపోయినట్లు ప్రకటించారు. శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుల కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బాల్ ఠాక్రే కూడా చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. వివాదాస్పద త్రిభాష సూత్రంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ,
Uddhav Thackeray: శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శనివారం తన విడిపోయిన బంధువు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ఠాక్రేతో 20 ఏళ్ల తర్వాత మొదటిసారిగా వేదిక పంచుకున్నారు. ఉప్పునిప్పులా ఉండే వీరిద్దరు తమ విభేదాలను పక్కన పెట్టి కలిశారు. ‘‘మేము కలిసి వచ్చాము, కలిసి ఉంటాము’’ అంటూ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
Sanjay Raut: మహారాష్ట్రలో ‘‘హిందీ వివాదం’’ నేపథ్యంలో విడిపోయిన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు కలిసి పోతున్నారనే టాక్ నడుస్తోంది. ఇటీవల, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. తనకు ఉద్ధవ్‌కి మధ్య ఉన్నవి చిన్న విభేదాలే అని, మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవి అంటూ కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలను పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.
భారతదేశ చరిత్రలో గొప్ప యోధులు, సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేర్లలో ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆయన పేరు ఉంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. చిన్నతనంలోనే మొఘలుల దాడులలో హిందూ మతం అంతరించి పోతుందని, వారితో యుద్ధంలో ఓడిపోయి అందరూ చేతులెత్తేసిన వేళ శివాజీ మహారాజు మండే నిప్పు కణికలా దూసుకొచ్చాడు. మొగల్ రాజులతో ఎంతో వీరోచితంగా పోరాడాడు. అందుకే హిందూమతాన్ని కాపాడిన ఘనత ఒక్క మరాఠా మహారాజు శివాజీకే దక్కుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి…
మహారాష్ట్ర ఎస్పీ అధ్యక్షుడు అబూ అజ్మీ.. మొఘల్ చక్రవరి ఔరంగజేబ్ గొప్ప పాలకుడని, క్రూరుడు కాదని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదం ముదరడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఇందువల్ల ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
Devendra Fadnavis: మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సాధించి, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కీలకంగా మారాయి. ఠాక్రేలతో బీజేపీకి ఉన్న సంబంధాల గురించి ఆయన వ్యాఖ్యానించారు. ‘‘గతంలో ఉద్ధవ్ ఠాక్రే ఒక స్నేహితుడు, ఇప్పుడు రాజ్‌ఠాక్రే స్నేహితుడు, కానీ ఉద్ధవ్ ఠాక్రే శత్రువు కాదు’’ అని అన్నారు.