మహారాష్ట్ర అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ప్రశంసించినందుకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఓ వైపు ఔరంగజేబును ప్రశంసిస్తూ.. ఇంకోవైపు శంభాజీ మహారాజ్‌ను విమర్శిస్తూ అజ్మీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. అసెంబ్లీ సభ్యుడి హోదాకు ఈ వ్యాఖ్యలు తగినవి కావని.. ప్రజాస్వామ్య సంస్థను అవమానించడమేనని రాష్ట్ర మంత్రి చంద్రకాంత్ పాటిల్ అన్నారు.
Devendra Fadnavis: లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగిన భారత్ జోడో యాత్రలో "అర్బన్ నక్సల్స్" సంస్థలు పాల్గొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన ఆరోపణలు చేశారు.
డిసెంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్ష అనంతరం ప్రస్తుతం అందరి దృష్టి మహాయుతి కూటమి మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ‘మహావికాస్ అఘాడీ’ కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించారు. వారి నిర్ణయం ప్రస్తుతం పొలిటికల్ సర్కార్ లో చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది. సినీ, రాజకీయ ప్రముఖులంతా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
Snake In Meals : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఓ చిన్నారి మధ్యాహ్న భోజనం ప్యాకెట్‌లో చనిపోయిన పాము కనిపించడంతో కలకలం రేగింది. ఈ విషయంపై చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సార్వత్రిక ఎన్నికల ముందు మహారాష్ట్ర అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఒక్కరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ బిల్లును ఆమోదించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భద్రత కోసం 11,000 మంది పోలీసులు, 40 బాంబ్ స్క్వాడ్‌లు, 10 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), ఇతర భద్రతా దళాలు మోహరించనున్నారు. 14 రోజుల పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగియనున్నాయి.
శివసేన-బీజేపీ కూటమిని ఓడించేందుకు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు అజిత్ పవార్ సోమవారం అన్నారు.