నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలన్నదే తన ఆశ, ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచిందన్నారు. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరికాసేపట్లో మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ‘తెలుగుదేశం మహా పండుగ…
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండగగా భావించే ‘మహానాడు’ నేటి నుంచి కడప జిల్లాలో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప మొత్తం పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పసుపు మయం అయింది. మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రానున్నారు. ప్రస్తుతం…
కడపలో టీడీపీ ‘మహానాడు’ సంబరం మంగళవారం ప్రారంభమవుతోంది. టీడీపీ చరిత్రలో తొలిసారిగా వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు దాదాపు పూర్తి కావొచ్చాయి. రేపటి నుండి మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మహానాడు పనుల్లో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బిజీగా ఉన్నారు. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్‌గా ఉన్న నిమ్మల.. వర్షం కారణంగా సభా ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. పార చేతపట్టి మట్టి…
అనంతపురం అర్బన్ మినీ మహానాడులో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు. అనంతపురం నగరంలోని కమ్మ భవన్‌లో అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో మినీ మహానాడు జరిగింది. ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ముందే సాకే వెంకటేష్ అనే టీడీపీ కార్యకర్త పురుగుల మందు తాగాడు. పార్టీ కోసం కష్టపడిన తమకు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఎదుటే వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. Also Read: IPL 2025: అలాంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవద్దు! ఎస్సీ సామాజిక…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 నెలల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. రానున్న నాలుగేళ్లలో నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పిస్తామన్నారు. దేశంలోని కోటి సభ్యత్వం కలిగిన ప్రధాన పార్టీ తెలుగుదేశం అని ఎమ్మెల్యే కాకర్ల కొనియాడారు. వింజమూరు ఎస్వి కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే కాకర్ల టీడీపీ మహానాడు నిర్వహించారు. మహానాడులో టీడీపీ జెండా ఆవిష్కరించి, స్వర్గీయ నందమూరి తారకరామారావు నివాళులర్పించారు.…
పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కనివిని ఎరుగని రీతిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించాం అన్నారు. మహానాడు నిర్వహణపై కమిటీలు వేశాం.. మహానాడు నిర్వహణలో 13 కమిటీలు కీలకంగా వ్యవహరించబోతున్నాయి.. ఆ 13 కమిటీల సలహాలు, సూచనలను క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
టీడీపీలో ఒకే పదవిలో మూడు సార్లు కంటే ఎక్కువ ఉండరాదన్న ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిపాదనకు పార్టీ పొలిట్ బ్యూరో ఆమోద ముద్ర వేసింది. మూడుసార్లు, ఆరేళ్లుగా పదవిలో ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించారు.
టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించనున్నారు. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా…