YS Jagan: కడప వేదికగా టీడీపీ మహానాడు జరుగుతోన్న వేళ.. ఆ పసుపు పండుగపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్.. మహానాడు పెద్ద డ్రామాగా అభివర్ణించిన ఆయన.. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా..? అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారని పేర్కిన్నారు. చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడు.. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు.. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుంది.. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది..? అని నిలదీశారు.
Read Also: Atti Satyanarayana: దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్.. ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అంటూ..
రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నారు.. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.. చంద్రబాబుది దౌర్భాగ్యపు పాలని అని విమర్శించారు.. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్నా.. ఏరోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు.. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కనపెట్టలేదు.. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం.. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం.. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం.. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం.. 99శాతం హామీలను అమలు చేశాం.. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం.. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని స్పష్టం చేశారు వైఎస్ జగన్.