బార్యభర్తల మధ్య మనస్పర్ధలు సాధారణమే.. కానీ, ఆ చిన్న చిన్న కారణాలనే మనసులో పెట్టుకొని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వ్యక్తి భార్య కాపురానికి రానని చెప్పడంతో మనస్థాపానికి గురై రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. జడ్చర్లకు చెందిన ఉదయ్‌కుమార్(30)కు హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన యువతితో సంవత్సరం క్రితం వివాహమైంది. కొద్దిరోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. ఉదయ్ తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని, తనతో ఉండడం కుదరదని ఆమె ఇటీవల హైదరాబాద్ లో ఉన్న తన పుట్టింటికి వచ్చేసింది. తన భర్త వరకట్న కోసం వేధిస్తున్నాడని భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ కోసం ఉదయ్ ని హైదరాబాద్ వచ్చాడు. విచారణ ముగిసిన అనంతరం ఉదయ్ హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చి, పట్టణ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య చేసిన పనికి మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉదయ్ తల్లిదండ్రులు తెలుపుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.