Adult Content: సెల్ ఫోన్ లో చిన్నారుల అశ్లీల చిత్రాలు డౌన్ లోడ్ చేసి చూసినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి మద్రాస్ హైకోర్టు ముందు హాజరు పర్చారు. ఈ కేసులో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాలు చూడడం నేరం కాదని తెలిపింది. తనపై నమోదైన కేసును క్యాన్సిల్ చేయాలని కోరుతూ అంబత్తూరుకు చెందిన యువకుడు మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు.
Read Also: Woman Dance Railway Station : కొత్త బండి ముందు ముద్దుగుమ్మ డ్యాన్స్.. ఏం చేసింది బాసూ
అయితే, నిన్న( శుక్రవారం) ఈ కేసు విచారణకు రాగా.. కోర్టుకు హాజరైన యువకుడు తాను అశ్లీల సినిమాలు చూడడం నిజమే.. కాకపోతే తాను చూసినవి పిల్లలకు సంబంధించినవి కావని మద్రాస్ హై కోర్టుకు తెలియజేశాడు. ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్టు సదరు యువకుడు న్యాయస్థానానికి చెప్పుకొచ్చాడు. వాదోపవాదాల ముగిసిన తర్వాత ఈ కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఉత్తర్వులు వెల్లడించారు.
Read Also: CMD Musharraf: పతంగులు బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేయండి.. ప్రజలకు సీఎండీ విజ్ఞప్తి..
ఇక, అశ్లీల చిత్రాలను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వ్యక్తిగతంగా చూడడంలో ఎలాంటి తప్పు లేదని.. వాటిని ఇతరులకు షేర్ చేస్తేనే నేరమని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. 1990లలోని యువత మద్యం, ధూమపానానికి ఎలా అలవాటయ్యారో, 2కే కిడ్స్ కూడా అలాగే పోర్న్ మూవీస్ లకు బానిసలుగా మారారు అని చెప్పారు. వారిపై అనవసరంగా నిందలు మోపడం ఆపేయలి.. ఆ అలవాటు నుంచి వారు బయటపడేందుకు అవసరమైన సలహాలు ఇచ్చేంత పరిణతి ఈ సమాజానికి రావాలని కోర్టు తెలిపింది. ముుఖ్యంగా స్కూల్ స్థాయిలోనే వారికి ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాల్సి ఉందని న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ తెలిపారు.