మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తనకు కంచుకోటగా పేరుగాంచిన బుద్ని నుంచి పోటీ చేయనున్నట్టు సోమవారం విడుదల చేసిన బీజేపీ నాల్గవ అభ్యర్థుల జాబితా వెల్లడించింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శనివారం దేశ రాజధానిలో జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.
హుజన్ సమాజ్ పార్టీ (BSP) ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ప్రకటించిన ఏడు స్థానాల్లో ప్రస్తుతం నాలుగు అధికార బీజేపీ, మిగిలిన మూడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.
కర్ణాటకలో విజయం అనంతరం దేశంలో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దేశంలో బీజేపీని గద్దె దించేందుకు తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ ఎన్నికలకు ఇప్పటి నుంచి హామీల వర్షం కురిపించి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.