తమిళనాడులో తమకంటూ స్పెషల్ ఇమేజ్ అండ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోలు ‘సిద్దార్థ్’, ‘మాధవన్’. లవ్, యాక్షన్, ఎక్స్పరిమెంట్స్, యూత్ ఫుల్ సినిమాలు చేసిన సిద్దార్థ్, మాధవన్ కి పాన్ ఇండియా రేంజులో కూడా మంచి గుర్తింపు ఉంది. హిందీలో కూడా స్ట్రెయిట్ సినిమాలు చేసిన ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన ప్రతిసారీ ఒక మంచి సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది. త్వరలో సిద్దార్థ్, మాధవన్ కలిసి నటిస్తున్నారనే అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది కాబట్టి…
Nayanthara: పెళ్లి తర్వాత నయన్ జోరు పెంచేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ప్రకటించి షాక్ ఇస్తోంది. పెళ్ళికి ముందే నయన్.. షారుక్ సరసన జవాన్ సినిమాలో నటిస్తుంది అన్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
హీరోలు.. ఒక సినిమా కోసం ఏదైనా చేయగల సమర్థులు. బాడీ పెంచాలన్న, బాడీ తగ్గించాలన్నా.. అందంగా కనిపించాలన్నా, అందవిహీనంగా కనిపించాలన్న వారికే చెల్లుతోంది. ఇక బయోపిక్ ల విషయానికొస్తే.. ఒరిజినల్ వ్యక్తులను కూడా మైమరిపించేస్తారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ అదే పని చేస్తున్నాడు. మాధవన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తునానఁ చిత్రం ‘రాకెట్రీ’. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన…
అనువాద చిత్రాలతోనే తెలుగువారిని ఆకట్టుకున్న మాధవన్, ఇప్పుడు స్ట్రెయిట్ మూవీస్ తోనూ మెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. ‘ఓం శాంతి’ తెలుగు చిత్రంలో అతిథి పాత్రలో కనిపించిన మాధవన్, ‘సవ్యసాచి’, ‘నిశ్శబ్ధం’ చిత్రాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించాడు. నటునిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకునిగానూ తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నంలో ఉన్నాడు మాధవన్. రంగనాథన్ మాధవన్ 1970 జూన్ 1న జెమ్ షెడ్ పూర్ లో జన్మించాడు. ఆయన తండ్రి రంగనాథన్ తమిళనాడుకు చెందిన అయ్యంగార్. టాటా…
ప్రముఖ నటుడు మాధవన్ తొలిసారి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా ‘రాకెట్రీ’. భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో విశేష కృషి చేసిన సైంటిస్ట్ నంబి నారాయణ్ బయోగ్రఫీ ఇది. ఇప్పటికే తొలికాపీ సిద్దం చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను చూసి ప్రధాని నరేంద్రమోదీ మాధవన్, నంబి నారాయణ్ లను ప్రత్యేకంగా అభినందించారు. మాధవన్ నంబి నారాయణ్ గా నటించిన ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ,…
రాజ్ కుంద్రా ఉదంతంలో శిల్పా ఎదుర్కొంటోన్న చిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు పోలీసుల దర్యాప్తులు, కోర్టుల విచారణలే కాక మరో వైపు మీడియా, సొషల్ మీడియా రాద్ధాంతం ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అందుకే, శిల్పా భర్త అరెస్ట్ తరువాత మొదటిసారి విపులంగా స్పందించింది. వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాను ఏం మాట్లాడనని మరొక్కమారు తేల్చి చెప్పిన మిసెస్ కుంద్రా ముంబై పోలీస్, భారతీయ న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొంది. తాను అనని…
వర్సిటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’, ‘మారా’ చిత్రాలు ఒకదాని వెనుక ఒకటి విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు నిజానికి థియేటర్లలో విడుదల కావాల్సినవి. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూత పడటం, ఒకవేళ తెరిచినా పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ లేకపోవడం వల్ల దర్శక నిర్మాతలు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయడానికి మొగ్గు చూపారు. అలా ఓటీటీ లోనే ఈ రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇదిలా ఉంటే…. మాధవన్ దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ…
2017లో సంచలన విజయం సాధించిన తమిళ చిత్రం ‘విక్రమ్ వేదా’. ఈ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఇద్దరు నటులు ఈ చిత్రంలో అద్భుతమైన నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి దర్శకనిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. తెలుగులో ఈ సినిమాపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ హిందీ వెర్షన్…
దర్శకుడు లింగుసామిదర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ ద్విభాషా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న లింగుసామి, రామ్ పోతినేని కాంబినేషన్ లో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం రూపొందనుందని ప్రకటించారు. ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఆ రూమర్స్ పై మాధవన్ స్పందించాడు. “లింగుసామితో వర్క్ చేయడానికి,…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఉగాది సందర్భంగా స్టార్ట్ అయ్యింది. రెండవ షెడ్యూల్ లో కరోనాకు సంబంధించిన అన్ని భద్రతా చర్యలను అనుసరిస్తూ షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. ఇప్పటివరకు పలువురు స్టార్స్ మహేష్ కు విలన్ గా నటించబోతున్నారని…