సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఉగాది సందర్భంగా స్టార్ట్ అయ్యింది. రెండవ షెడ్యూల్ లో కరోనాకు సంబంధించిన అన్ని భద్రతా చర్యలను అనుసరిస్తూ షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ ఎవరనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. ఇప్పటివరకు పలువురు స్టార్స్ మహేష్ కు విలన్ గా నటించబోతున్నారని…