The Test : మాధవన్, నయనతారల మొదటి సారి కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నారు. వారు నటించనున్న చిత్రం ‘ది టెస్ట్’. ఇటీవలే ఆఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషిస్తారని సమాచారం. ప్రముఖ నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా తొలిదశ పనులు మొదలయ్యాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులను ప్రకటించారు. ఈ సినిమా కథ క్రికెట్‌కు సంబంధించినది కావడంతో ధృవ్ పంచవానీని స్పోర్ట్స్ డైరెక్టర్‌గా నియమించారు.
Read Also : Yash 19 : ఆ హీరోయిన్ దర్శకత్వంలో నటించనున్న యష్ ?
అదేవిధంగా సినిమాలో గ్రాఫిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని చిత్రబృందం తెలిపింది. వీఎఫ్‌ఎక్స్ కోసం విజయ్‌ని ఎంపిక చేశారు. సౌండ్ మిక్సింగ్ వర్క్ కునాల్ రాజన్, రాజా కృష్ణన్, సౌండ్ రికార్డింగ్ వర్క్ సిద్ధార్థ్ సదాశివం, కాస్ట్యూమ్ డిజైనర్స్ గా పూర్ణిమ రామసామి, అనువర్ధన్ లు ఈ సినిమాకు వర్క్ చేయనున్నారు. డిఎస్ సురేష్ ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేస్తున్నారు. క్రికెట్‌కు సంబంధించిన ఈ సినిమా షూటింగ్ చెన్నై, బెంగుళూరులో జరగనుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
Read Also :Shahrukh Khan Son : మామూలుగా లేదు.. తండ్రి యాక్షన్.. కొడుకు డైరెక్షన్..!