మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో.. ఈవీఎం ధ్వంసంతోపాటు, మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తుంది.. ప్రస్తుతం నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి బస చేసినట్టు గుర్తించిన పోలీసులు.. ఆయన కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.
పలనాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరొకసారి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాచర్లలోని 28వ వార్డులో పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు కడుతున్నారు టీడీపీ నాయకులు.
Pinnelli Ramakrishna Reddy: 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు, లోకేష్ తోకలు కట్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మేరకు దోషులకు శిక్ష పడుతుందన్నారు.. కానీ, దీనిపై రాజకీయం చేయడం తగదన్నారు.. ఇక, నారా లోకేష్ వార్డు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత.. 151 అసెంబ్లీ సీట్లు గెలిచిన సీఎం వైఎస్ జగన్ పై విమర్శలు చేయాలంటూ…
Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓటమి అంటే తెలియని రాజకీయ చరిత్ర నాదన్న పిన్నెల్లి.. 2004 నుంచి 2024లో కూడా విజయం నాదేనని ధీమా వ్యక్తం చేశారు.. 2024లో నన్ను ఓడించగలిగితే నేను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు.. నా మీద నలుగురు అభ్యర్థులను టీడీపీ నాయకులు రంగంలోకి దించారు.. అందరూ నా చేతిలో ఓడిపోయిన వారేన్న ఆయన.. మాచర్లలో జరుగుతున్న ప్రతి చిన్న సంఘటన రాజకీయంగా…
పల్నాడు జిల్లా మాచర్లలో తాజాగా జరిగిన హింసాత్మక ఘటనలు కలకలం సృష్టించాయి.. ఇక, ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇంఛార్జీ బ్రహ్మారెడ్డి సహా తొమ్మిదిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.. ఇందులో ఏ-1గా బ్రహ్మారెడ్డిని పేర్కొన్నారు. అయితే, మాచర్లలో పరిస్థితులు, కేసులపై ఓ వీడియో విడుదల చేశారు మాచర్ల టీడీపీ ఇంచార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి.. టీడీపీ నేత చంద్రయ్య హత్య కేసులో…
Julakanti Brahma Reddy: పల్నాడు జిల్లా మాచర్లలో పొలిటికల్ హీట్ నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పుపెట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మాచర్ల టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. తమ ఇళ్లను తామే తగులబెట్టుకున్నామని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మాచర్ల మెయిన్ రోడ్డుపై ఉన్న షాపుల్లో కరపత్రాలు పంచుతున్నామని.. ఆ సమయంలో వైసీపీ నేతలు…
జాతీయ పతాక రూపకర్త స్వర్గీయ పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి కన్నుమూశారు.. ఆమె వయస్సు వందేళ్లు.. ప్రస్తుత పల్నాడు జిల్లా మాచర్లలోని ప్రియదర్శిని కాలనీ నివాసం ఉంటున్న ఆమె.. గురువారం రాత్రి ప్రాణాలు విడిచారు.. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు.. అయితే, సీతామహాలక్ష్మీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఆమె అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా,…
దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ముందు వర్షాలతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారింది. విశాఖలో చల్లని, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ప్రధాన వీధులన్నీ జలమయం అయ్యాయి. శ్రీశైలంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో భక్తులు…
మంత్రి పదవి రాలేదని ఏపీలో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తం అయ్యాయి. సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మంత్రి పదవి రాకపోవడంపై పిన్నెల్లిని బుజ్జగించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం ఆయన మాట్లాడారు. మొదట్నుంచీ జగన్ కోసం, పార్టీకోసం పనిచేశాం. ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఒకసారి వైఎస్, మూడు సార్లు జగన్ నాయకత్వంలో ఎమ్మెల్యే అయ్యా. సామాజిక…