మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో విధుల్లో ఉన్న పీఓ, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఘటనపై సమాచారం ఇవ్వనందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు.
మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై సీరియస్ అయిన సీఈసీ.. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మాచర్ల సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముకేష్‌కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం తాఖీదు పంపింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం సంఘటనపై ఏపీ సీఈఓను కేంద్ర ఎన్నికల సంఘం వివరణ అడిగింది.